Viral News: టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగాన్ని కొరికిన పైథాన్.!

సాధారణంగా పాము మన ఇంటి ఆవరణలో కనిపిస్తే చాలు.. రాత్రుళ్లు అసలు నిద్రపట్టదు. అలాంటిది ఓ పైథాన్ అకస్మాత్తుగా టాయిలెట్‌లో ప్రత్యక్షమైతే..

Viral News: టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగాన్ని కొరికిన పైథాన్.!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2021 | 12:34 PM

పాము, అనకొండను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అది మానవ నైజం. అయితే కొంతమంది ఆ విషసర్పాలతో గారడీలు చేస్తే.. మరికొందరు వాటిని పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. మనదేశంలో అయితే ఇలాంటివి రేర్ గానీ.. విదేశాల్లో మాత్రం కోకొల్లలు. ఎంతోమంది పైథాన్‌లను పెట్స్ కింద ఇళ్లలో పెంచుకుంటారు. ఇక అదే ఓ వ్యక్తి ప్రాణం మీదకు తీసుకొచ్చింది.

సాధారణంగా పాము మన ఇంటి ఆవరణలో కనిపిస్తే చాలు.. రాత్రుళ్లు అసలు నిద్రపట్టదు. అలాంటిది ఓ పైథాన్ అకస్మాత్తుగా టాయిలెట్‌లో ప్రత్యక్షమైతే.. ఇంకేమైనా ఉందా.! పైప్రాణం పైనుంచేపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. టాయిలెట్‌లో కూర్చున్న ఓ వ్యక్తిని పైథాన్ దాడి చేసింది. అది కూడా ప్రైవేట్ పార్ట్‌పై కొరికింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

‘డైలీ మెయిల్’ నివేదిక ప్రకారం.. 65 ఏళ్ల వ్యక్తి తెల్లారుజామున టాయిలెట్‌లోకి వెళ్లాడు. యధాలాపంగా టాయిలెట్ సీటుపై కూర్చోగానే.. ఎక్కడో అలికిడి అవుతున్నట్లు.. ఏదో కొత్తగా ఉన్నట్లు అతడికి అనిపించింది. ఏంటా.! అని చూడగానే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడ ఒక పైథాన్ తిష్ట వేసుకుని ఉంది. ఆ గగుర్పొడిచే దృశ్యాన్ని చూసిన అతడు కాస్త తేరుకుని బయటపడేలోగా.. జరగాల్సింది జరిగిపోయింది. పైథాన్ అతడి ప్రైవేటు పార్ట్‌ను కొరికింది. ఈ ఘటనకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు అందుకుని.. అక్కడికి చేరుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది.

పక్కింట్లో 11 పాములను పెట్స్‌గా పెంచుతున్నారు…

ఈ సంఘటన ఆస్ట్రియాలోని గ్రాజ్ అనే నగరంలో చోటు చేసుకుంది. వృద్దుడి ఇంటి టాయిలెట్‌లో కనిపించిన పామును పక్కింటివాళ్లు పెంచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు పక్కింట్లో నివసిస్తున్న వాళ్లు 11 పాములు పెంచుకుంటుండగా.. అందులో ఓ పాము డ్రైన్ పైప్ ద్వారా బాధితుడి టాయిలెట్‌లోకి ప్రవేశించిందని తేలింది.

పాముల కోసం ప్రత్యేక బోను తయారు చేశామని.. అందులో నుంచి పైథాన్ ఎలా బయటికి వచ్చిందో తెలియదని తమ వాంగ్మూలంలో పక్కింటివాళ్లు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ పాములను పెంచే అతని వయస్సు 24 సంవత్సరాలుగా గుర్తించగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి.. పాములను పట్టుకునేందుకు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?