కోల్‌కతాలో ఫేక్ సీబీఐ అధికారి అరెస్టు.. ఇంటరాగేషన్ లో ఏం చెప్పాడంటే …?

కోల్‌కతాలో ఫేక్ సీబీఐ అధికారి అరెస్టు.. ఇంటరాగేషన్ లో ఏం చెప్పాడంటే ...?
Arrested Posing As Cbi Official

కోల్‌కతాలో  పోలీసులు ఓ లాయర్ ని అరెస్టు చేసి విచారించినప్పుడు వారు షాక్ తినే విషయాలు చెప్పాడు. 2018 లో జోహాన్స్ బర్గ్ లో తాను ప్రధాని మోదీతో కలిసి 'బ్రిక్స్' సమావేశంలో పాల్గొన్నానని, ప్రధానితో తనకు సాన్నిహిత్యం ఉందని సనాతన్ రే చౌదరి అనే లాయర్ తెలిపాడు.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 07, 2021 | 1:21 PM

కోల్‌కతాలో పోలీసులు ఓ లాయర్ ని అరెస్టు చేసి విచారించినప్పుడు వారు షాక్ తినే విషయాలు చెప్పాడు. 2018 లో జోహాన్స్ బర్గ్ లో తాను ప్రధాని మోదీతో కలిసి ‘బ్రిక్స్’ సమావేశంలో పాల్గొన్నానని, ప్రధానితో తనకు సాన్నిహిత్యం ఉందని సనాతన్ రే చౌదరి అనే లాయర్ తెలిపాడు. పైగా తనకు కేంద్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు కూడా ఉన్నాయన్నాడు. తనను సీబీఐ అధికారిగా.. సీబీఐ తరఫున కోర్టుల్లో వాదిస్తున్న న్యాయవాదిగా కూడా చెప్పుకున్నాడు. అయితే బూటకపు అధికారిగా ప్రచారం చేసుకుంటున్నాడని, ఇంతేగాక ఫోర్జరీ, కుట్రకు పాల్పడ్డాడన్న ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. బ్లూ బెకన్ అమర్చిన కారులో తిరుగుతూ అమాయకులను బురిడీ కొట్టించే ఈ లాయర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడట. ఇతగాడు చెప్పిన వివరాలకు వాస్తవాలకు పొంతన లేదని పోలీసులు కనుగొన్నారు. కొన్ని భూకబ్జా కేసులతో కూడా ఇతనికి లింక్ ఉన్నట్టు వారు అనుమానిస్తున్నారు. కోల్ కతా లో ఇటీవల నిర్వహించిన ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంపు కేసుకు సంబంధించి దీపాంజన్ దేబ్ అనే ఫేక్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక సిట్ బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 9 మందిని వారు అరెస్టు చేశారు. వారికోసం గాలిస్తున్నారు.

ఇలా ఉండగా నగరంలో ఇలాంటి బూటకపు వ్యక్తులు పెరిగిపోతున్నారని, తమకు అనుమానాస్పదంగా ఉన్నారని తెలిసిన వ్యక్తుల గురించి ప్రజలు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా అరెస్టు చేసిన లాయర్ కి మరికొందరు కూడా సహకరిస్తున్నట్టు తేలినట్టు వారు చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Nellore Murder: గూడూరులో యువతిని చంపేంది అతనే.. నిందితుడి ఆట కట్టించిన పోలీసులు..

Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu