AP Theatres: సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

AP Government: సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే...

AP Theatres: సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!
Theatres
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2021 | 1:22 PM

సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కరోనా కారణంగా అందరి జీవనోపాధి దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటం.. మళ్లీ ప్రజలు గాడిలో పడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు భగ్గుమంటుంటే.. మరోవైపు పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఇలాంటి తరుణంలో థియేటర్ల యాజమాన్యం టికెట్ రేట్లను పెంచేస్తే.. దాని వల్ల ప్రజలపై మరో భారం పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, జూలై 8వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున: ప్రారంభం కానున్నాయి. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో ఏపీలో ఓపెన్ అవుతుండగా.. తెలంగాణలో 100 శాతం సీటింగ్ క్యాపాసిటీతో తెరుచుకోనున్నాయి.

Also Read:

దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!