AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Murder: గూడూరులో యువతిని చంపింది అతనే.. ప్రేమోన్మాది డ్రామాలకు చెక్ పెట్టిన పోలీసులు..

Nellore Murder: నెల్లూరు జిల్లాలో గూడూరులో ప్రేమ పేరుతో వేధించి యువతిని హత్య చేసిన నిందితుడు వెంకటేశ్వర్లుని..

Nellore Murder: గూడూరులో యువతిని చంపింది అతనే.. ప్రేమోన్మాది డ్రామాలకు చెక్ పెట్టిన పోలీసులు..
Arrested
Shiva Prajapati
|

Updated on: Jul 07, 2021 | 2:26 PM

Share

Nellore Murder: నెల్లూరు జిల్లాలో గూడూరులో ప్రేమ పేరుతో వేధించి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది వెంకటేశ్వర్లుని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీన గూడురులో తేజస్విని అనే యువతిని వెంకటేశ్వర్లు హత్య చేశాడు. పట్ట పగలే తేజస్విని ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో పొడిచాడు. గొంతుకు గుడ్డ బిగించి హత్య చేశాడు. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే, వెంకటేశ్వర్లుని విచారించగా.. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని చెప్పుకొచ్చాడు. కానీ, అతని పోలీసుల విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే తేజస్విని ని వెంకటేశ్వర్లు చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఏఎస్పీ బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. తేజస్విని కుటుంబానికి, నిందితుడు వెంకటేశ్వర్లు కుటుంబానికి ఏడేళ్లుగా పరిచయం ఉంది. వెంకటేశ్వర్లు తేజస్విని ని ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఎక్కువగా ఉండడంతో వీరి వివాహానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో తేజస్విని తన మొబైల్ నెంబర్‌ని కూడా మార్చేసింది. అయితే, తనకు దక్కని తేజస్విని ఎవరికీ దక్కకూడదని భావించిన వెంకటేశ్వర్లు.. పక్కా స్కెచ్ ప్రకారం తేజస్విని ని దారుణంగా హత్య చేశాడు. 1వ తేదీన పట్టపగలు తేజస్విని ఇంటికి వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తేజస్వినిని పొడిచాడు. అప్పటికీ తేజస్విని చనిపోకపోవడంతో.. ఆమె మెడకు గుడ్డ బిగించి హత్య చేశాడు. ఆ తరువాత తానూ ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు వెంకటేశ్వర్లు. తేజస్వినిని పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. ఈ కేసులో వెంకటేశ్వర్లుకు మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో వెంకటేశ్వర్లుని ఏ1 గా పేర్కొనగా.. పృథ్విరాజ్ ఏ2, శివ ఏ3 గా చేరుస్తూ కేసు నమోదు చేశారు.

Also read:

Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..

జేడీయు‌లో కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు.. సీఎం నితీష్, జేడీయు నేత భిన్నస్వరాలు…

Breaking: సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!