జేడీయులో కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు.. సీఎం నితీష్, జేడీయు నేత భిన్నస్వరాలు…
ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉండగా బీహార్ జీడీ-యూలో లుకలుకలు మొదలయ్యాయి.
ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉండగా బీహార్ జీడీ-యూలో లుకలుకలు మొదలయ్యాయి. కేంద్ర కేబినెట్ లో తాము చేరుతామని, తమకు ఎన్ని పదవులు ఇచ్చినా సమ్మతమేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించగా..నాలుగు కన్నా తక్కువ పదవులు ఇస్తే సహించబోమని, కేబినెట్ లో తాము చేరబోమని జేడీ-యూ నాయకుడొకరు స్పష్టం చేశారు. కేవలం రెండు పదవులు మాత్రమే ఇస్తే అది తమ రాష్ట్రంలో సామాజిక సమతుల్యాలపై ప్రభావం చూపుతుందని, రాజకీయ పోకడ కూడా మారుతుందని ఆ నాయకుడు చెప్పారు. తమ పార్టీ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారని, అందువల్ల 4 బెర్తులు కావాలని తాము కోరుతున్నట్టు ఆయన తెలిపారు. అటు నితీష్ మాత్రం తమకు ఏ ఫార్ములా గురించి గానీ తెలియదని, బీజేపీ ఎన్ని పోస్టులు ఇచ్చినా ప్రభుత్వంలో చేరుతామని అంటున్నారు. ప్రధాని ఏది నిర్ణయించినా అది తమకు అంగీకారయోగ్యమేనన్నారు. అయితే ఢిల్లీలో ఉన్న జేడీ-యూ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి.పీ సింగ్ కే మొత్తం వ్యవహార బాధ్యతను పార్టీ అప్పగించింది. మొత్తానికి జేడీ-యూకీ రెండు పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ట్విట్టర్లో ఎవరు ఎక్కువగా ఎదిరిస్తారో.. ఎవరు ఎక్కువగా విమర్శిస్తారో వారికి ఈ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ కేబినెట్ కూర్పును తాము ముందే ఊహిస్తున్నామని.. రాహుల్ మీద ఎంత ఎక్కువ ట్వీట్లు చేస్తే వారికే ప్రమోషన్ లభిస్తుందని ఈ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిందేనన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Breaking: సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!