Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..

'సాసురల్ సిమర్ కా' సీరియల్‏తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి షగుప్త అలీ ఆర్థిక సమస్యలతో సతమతవుతుంది. 'పునర్ వివాహ్', 'వీరా', వంటి సీరియల్లో నటించిన

Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..
Shagufta Ali
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2021 | 1:12 PM

‘సాసురల్ సిమర్ కా’ సీరియల్‏తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి షగుప్త అలీ ఆర్థిక సమస్యలతో సతమతవుతుంది. ‘పునర్ వివాహ్’, ‘వీరా’, వంటి సీరియల్లో నటించిన షగుప్త అలీ ఇప్పుడు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటూ… మరోవైపు కరోనా కారణంగా పనులు లేకపోవడంతో.. ఆమె పరిస్థితి దారుణంగా మారింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షగుప్త అలీ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్‏తో బాధపడుతున్నాను.. ప్రస్తుతం క్యాన్సర్ మూడో దశతో పోరాడుతున్నా.. ఇప్పటివరకు 9 కెమోథెరపీ సెషన్లు చేయించుకున్నాను.. ఇక తర్వాత చికిత్స కోసం డబ్బు లేదని తెలిపింది. నాలుగు సంవత్సరాలుగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోంటున్నానని.. మధుమేహం, కంటిచూపు మందగింపు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. వైద్య ఖర్చుల కోసం కారు, నగలు, ఆస్తులు అమ్మేసానని తెలిపింది. ప్రస్తుతం వైద్యం కోసం ఆటోలో వెళ్తున్నానని చెప్పుకోచ్చింది.

ఇప్పటివరకు ఎవరి దగ్గరి నుంచి సహాయం పొందలేదని తెలిపింది.. CINTAA సహాయం చేస్తామని నన్ను సంప్రదించింది. కానీ తక్కువ డబ్బులు ఇస్తాననడంతో నేను వారి సహాయాన్ని తీసుకోలేదు. నేను (సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) సింటా సభ్యురాలినే. అందులో తక్కువ డబ్బు మాత్రమే సహాయంగా ఇస్తారని తెలుసు. కానీ నా వైద్య ఖర్చుల కోసం ఆ డబ్బు సరిపోదు అందుకే తీసుకోలేదు. ఆ తర్వాత సోనూసూద్ సాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఆయన సేవలు మాత్రమే చేస్తాడని.. ఆర్థికంగా సాయం చేయడని తెలిసి నిరాశ చెందాను అని తెలిపింది.

డయాబెటిస్ ప్రభావంతో నా కాలు తీవ్రంగా దెబ్బతిన్నది. నా కాలు మొద్దుబారిపోతుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడితో షుగర్ లెవల్స్ పెరిగాయి. దీంతో కంటి చూపు మందగించింది. నా తండ్రి, తమ్ముడు ఇద్దరు ఎనిమిదేళ్ళ క్రితం కన్నుముశారు. ప్రస్తుతం నాకు డబ్బు చాలా అవసరం.. ఎవరైనా సాయం చేయాలని కోరింది షగుప్త అలీ..

Also Read: Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షల జరిమానా.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. ఎందుకంటే ..?

Dilip Kumar : దిలీప్ కుమార్ అసలు పేరేంటో తెలుసా.. తన పేరు మార్చుకోవడానికి కారణమేంటంటే..