- Telugu News Photo Gallery Cinema photos Dilip kumar why his changed original name and some interesting points
Dilip Kumar : దిలీప్ కుమార్ అసలు పేరేంటో తెలుసా.. తన పేరు మార్చుకోవడానికి కారణమేంటంటే..
భారతీయ సినీ పరిశ్రమలో ఆయనో లెజెండ్.. తన నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అందరికీ వీడ్కోలంటూ వెళ్లిపోయాడు. మహ్మద్ యూసుఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్‌గా ఎలా ఎదిగారంటే..
Updated on: Jul 07, 2021 | 12:37 PM

దిలీప్ కుమార్ అసలు పేరు 'మహ్మద్ యూసుఫ్ ఖాన్'. 1922లో డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు.

దిలీప్ కుమార్‌కు మొదటి సారి సినిమా ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. 1944లో విడుదలైన 'జ్వార్ భాటా' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది.

తనే మహ్మద్ యూసుఫ్ ఖాన్ పేరును దిలీప్ కుమార్‌గా మార్చారు. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్‌గా స్థిరపడ్డాడు.

1949లో విడుదలైన 'అండజ్' సినిమా ద్వారా దిలీప్ కుమార్ గుర్తింపు పొందారు. ఇందులో రాజ్ కపూర్, నర్గిస్ లు కీలకపాత్ర పోషించారు.

ఆ తర్వాత ‘దేవదాస్’ (1955), ‘నయా దౌర్’ (1957), ‘మొఘల్-ఎ-అజామ్’ (1960), ‘గంగా జమునా’ వంటి హిట్ సినిమాల్లో నటించారు.

తన నటనతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో 'ట్రాజెడీ కింగ్' ప్రసిద్ధి చెందారు. దిలీప్ కుమార్.. పాష్టో, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్ భాషలను మాట్లాడగలడు.

ప్రఖ్యాత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు దాగ్ అవార్డును గెలుచుకున్న మొట్ట మొదటి నటుడు దిలీప్ కుమార్. ట్రాజెడి కింగ్ ఇమేజ్ తొలగించుకోవడానికి అనేక విభిన్న పాత్రలను పోషించాలనుకున్నాడు. టెక్నికలర్ అతని మొట్ట మొదటి చిత్రం. ఇందులో రైతు పాత్రలో కనిపించాడు.

1962లో బ్రిటిష్ నటుడు డేవిడ్ లీన్ తన లారెన్స్ ఆఫ్ అరేబియా చిత్రంలో 'షెరీఫ్ అలీ' పాత్ర కోసం దిలీప్ కుమార్‌ను సంప్రదించగా.. అతడు నిరాకరించాడు.

దిలీప్ కుమార్ మొదటిసారి నటి కామిని కౌషల్‌ను ప్రేమించాడు. 1948లో వచ్చిన షాహీద్ సినిమా సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అనుకొని కారణాల వలన వీరిద్దరు దూరమయ్యారు.

ఆ తర్వాత బాలీవుడ్ స్టార్లెట్ సైరా బాన్ ను మరో వివాహం చేసుకున్నారు. అయితే 1982లో దిలీప్ కుమార్ పాకిస్తాన్‌కు చెందిన ఆస్మా అనే మహిళను వివాహం చేసుకున్నారు.

దిలీప్ కుమార్...





























