Adah Sharma: సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న హాట్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది.
Updated on: Jul 06, 2021 | 10:26 PM

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో చేసింది ఈ వయ్యారి.

అయితే తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా అమ్మడికి అదృష్టం వరించలేదు.

సినిమాలకంటే అదాశర్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. వేడిపుట్టించే ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది అదాశర్మ. తరచు హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

ప్రస్తుతం తెలుగులో కొశ్చన్ మార్క్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తెలంగాణ యువతిగా కనిపించనుంది అదాశర్మ.





