- Telugu News Photo Gallery Cinema photos Tollywood resume shootings pushpa sarkaru vaari paata akhanda rrr
టాలీవుడ్ లో మళ్లీ మొదలైన సినిమా సందడి.. షూటింగ్ లు రీస్టార్ట్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.
Updated on: Jul 07, 2021 | 10:17 PM

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమలో షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడి ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు - పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారి పాట సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో న్యూ స్టైల్ తో కనిపించనున్నాడు మహేష్. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు కూడా కరోనా బ్రేక్ వేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవ్వబోతుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యు సినిమా షూటింగ్ కూడా ఇటీవలే రీస్టార్ట్ అయ్యింది. కరోనా కు ముందు శరవేగంగా జరిగిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చే టైం లో కరోనా ఎంట్రీ ఇచ్చింది దాంతో చిన్న బ్రేక్ ఇచ్చిన చిత్రయూనిట్ ఇటీవలే తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ ఈసారి అఖండ గా గర్జించడానికి సిద్దమయ్యారు. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు కూడా కరోనా అడ్డంకిగా మారింది. త్వరలోనే బాలయ్య సెట్స్ లో అడుగు పెట్టనున్నారు. ఈ సినిమాలో బాలయ్యను వేరే లెవల్ లో చూపించనున్నాడు బోయపాటి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. కొమురం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచి ఎదో ఒక అడ్డంకి ఏర్పడుతునే ఉంది మొదట్లో హీరోలకు గాయాలు, ఆతర్వాత కరోనా ఎంటర్ అవ్వడం.. ఇలా ఎదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఆర్ ఆర్ ఆర్ ను చకచకా పూర్తిచేయాలని చూస్తున్నాడు జక్కన. త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు.




