Karhika Deepam: చేయని తప్పుకి ఎందుకు తలదించుకోవాలి ..నిరూపించుకుంటా అంటున్న కార్తీక్.. సౌందర్య అమెరికా పయనం

Karhika Deepam: చేయని తప్పుకి ఎందుకు తలదించుకోవాలి ..నిరూపించుకుంటా అంటున్న కార్తీక్.. సౌందర్య అమెరికా పయనం
Karthika Deepam

Karhika Deepam: కార్తీకదీపం సీరియల్ ఈరోజు 108 లోకి అడుగు పెట్టింది. మోనిత పెళ్ళికి బట్టలు కొని ఏర్పాట్లు చేస్తుంటే.. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని కార్తీక్ ఆలోచిస్తున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను ఎందుకు తల దించుకోవాలి.. నేను చేయని..

Surya Kala

|

Jul 07, 2021 | 10:45 AM

Karhika Deepam: కార్తీకదీపం సీరియల్ ఈరోజు 108 లోకి అడుగు పెట్టింది. మోనిత పెళ్ళికి బట్టలు కొని ఏర్పాట్లు చేస్తుంటే.. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని కార్తీక్ ఆలోచిస్తున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను ఎందుకు తల దించుకోవాలి.. నేను చేయని తప్పుకి మోనిత ముందు ఇక ముందు తలదించుకోకూడదు. తన వ్యక్తిత్వం తప్పు చేసేది కాదు.. తాను మంచి భర్తగా , పిల్లలకు మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా ఉంటాను.. మోనిత కడుపు విషయం ఏమిటో కనుకుంటాను అని తనలో తానే నిర్ణయం తీసుకుంటాడు.

మోనిత రెడీ అయ్యి.. ఎంత అందంగా ఉన్నావు.. నీ అందం కోసమైనా పెళ్ళికి ఒప్పుకోవాలిగా ఈ ప్రపంచంలో అమాయకులు పెరిగిపోతున్నారు.. 16ఏళ్ళు వృధాగా పోయాయి. ఇక నైనా సుఖంగా సంతోషంగా ఉందాం అని కార్తీక్ ని ఎడ్యుకేట్ చేస్తా నని మోనిత అనుకుంటుంటే.. ఇంతలో పనిమనిషి ప్రియమణి వచ్చి.. అమ్మా అని అంటూ.. అక్కడికెనమ్మా అని అడిగితె తెలిసాక కూడా అడగడం ఎందుకు అంటే.. ఏమి జరుగుతుందో తెలిసాక కూడా అడగడం ఎందుకు అంటుంది మోనిత .. ఏమిజరుగుతుందని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నిస్తుంది.. ఒట్టిమనిషివి కావు అని తెలిసి కూడా కొట్టి మరీ పంపిస్తారు.. మీరు నన్ను కోపం గా చూసినా ఉన్నది ఉన్నట్లే చెబుతున్నా అంటూ.. కొడితే ఇదివరకులా పడడానికి మీరు ఒట్టిమనిషివి కావుగా అంటే మోనిత .. ఏడిచారు.. కొడుకు తప్పు చేశాడని మా అత్త నమ్ముతుంది.. భర్త ఏ తప్పు చేయకపోతే ఎందుకు తల దించుకుంటాడు అని మా వంటలక్క నమ్ముతుంది.. గుర్తున్నా గుర్తు లేకపోయినా కడుపు సాక్ష్యంగా ఉంది కనుక నా కార్తీక్ నమ్ముతున్నాడు.. ఇప్పుడు వాళ్ళందరి జుట్టు ఇంటి గుట్టు నా చేతిలో మంచి రసపట్టులో ఉంది. కనుక సోషల్ డిస్టెన్స్ చేయడం అలవాటైన ప్రజానీకంలో భాగంగా దూరంగా నిలబడి మాట్లాడుతున్నారు. అంటే.. ప్రియమణి అని మీరు అనుకుంటున్నారు.. కానీ కార్తీక్ ని దీపమ్మ వెళ్లిపొమ్మని ఇంటి నుంచి గెంటేయలేదు.. అటు తల్లి కార్తీకయ్య గురించి బాధపడుతుంది కానీ మీకు అన్యాయం అవుతుందని ఆలోచించడం లేదు మిమ్మల్ని .. కరోనాని అక్కా చెల్లెలు చూసినట్లు చూస్తున్నారు తప్ప.. మీకు నాయ్యం జరగాలని ఎవరూ ఆలోచించడం లేదు ఐతే ఇప్పుడు పెళ్లి కానీ తల్లిగా మిగిలిపోవాలా అంటే.. కార్తీకయ్య అందరిలాంటి మగడెమ్మా తన కుటుంబానికి వంశ గౌరవానికి తేడా రానంతవరకూ ఒకే .. కానీ అదే తేడా వస్తే,.. ప్లేట్ ఫిరాయిస్తాడు.. నాకు ఏమీ తెలియదని బుకాయిస్తాడు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు తప్పుని ఒప్పుకునే మగవాళ్ళు.. ఆ కొంతమందిలో కార్తీకయ్య ఉన్నాడని నాకు అనిపించడం లేదు.. కనుక మీకే అన్నీ తెలుసు అని అనుకోకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందో ఆలోచించండి. అంటే.. ఇంతలో కార్తీక్ ఫోన్ చేస్తాడు.

దీప మోనిత గోడ మీద గీసిన గీతలను చూస్తూ.. మోనిత మాటలను చేష్టలను గుర్తు చేసుకుంటుంటే..పదేళ్లు భర్త కోసం తప్పు చేశాను.. ఇన్నేళ్లు భర్తకోసమే ఆరాటపడ్డా.. ఇప్పుడు ఆ మోనిత నా జీవితాన్నే తిరగరాసింది.. ఏమి చేయాలి నేను.. ఆ మోనిత ని ఓడించాలా పిరికిదైనిలా పారిపోనా .. విరక్తితో వెళ్లిపోవాలా.. నా సౌభాగ్యాన్ని ఏవతో దోచుకుంటే నేను ఎలా మౌనంగా ఉంటాను అని ఆలోచిస్తుంటే.. ఇంతలో హిమ శౌర్యలు వస్తారు.. ఈ గీతాలన్నీ ఎవరు కొట్టేశారమ్మా అని శౌర్య అడిగితె.. ఈ గీతల్లో మన అందరి భవిష్యత్ ఉందని నాన్న చెప్పారు కాదమ్మా .. అసలు నువ్వు నాన్నా ఎప్పుడు మాట్లాడుకుంటారు.. మళ్ళీ ఎదో గొడవ జరుగుతుందా.. నీకు ఆరోగ్యం బాగైనప్పటి నుంచి నాన్న నువ్వు కొత్తగా కనిపిస్తున్నారు ఎందుకు.. ఏమైందమ్మా చెప్పమ్మా అంటూ హిమ శౌర్యలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఎప్పటికీ ఇలా మనం వేరుగా నానమ్మ వేరుగా ఉంటారా అని ప్రశ్నిస్తుంటే.. దీప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మోనిత ఆసుపత్రికి వచ్చిన భాగ్యం.. బీపీ చూపించుకుంటుంది. మీ మేడం ఎందుకు ఆస్పత్రికి రావడంలేదు ఎందుకు అనుకుంటున్నారు.. పెళ్లి పెటాకులు లేకుండా కడుపు తెచ్చుకుని.. దర్జాగా అలా తిరుగుతుంది అంటే.. ఆస్పత్రిలోని నర్సు.. కాదమ్మా ఆ డాక్టర్ బాబు ఆస్పత్రికి కూడా వస్తారు.. అంటే.. ఆ డాక్టర్ బాబు.. నిప్పు.. ముట్టుకుంటే కడుపు రాదు.. కాలి చస్తారు అంటే మీకు ఎట్లా తెలుసు అని అడుగుతుంది ఆస్పత్రిలోని ఆయా.. ఎలా తెలుసు ఏమిటి ఆ కార్తీక్ బాబు నా అల్లుడు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు.. అలాంటివాడు ఐతే నా అల్లుడు మోనిత కి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉండేవారు.. అయినా నా అల్లుడికి ఇద్దరు ఆడపిల్లలు .. పుట్టిన వెంటనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు మరి మోనిత కు కడుపు ఎలా వచ్చిందో ఎవరి తెలుసు అంటూ.. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భాగ్యం.

కార్తీక్ మాట్లాడకుండా ఉంటె.. మోనిత ఎమోషసనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. ఇలా చూడు కార్తీక్ మోనిత ని మోసం అంటే తెలియని మోనిత ని నీ బెస్ట్ ఫ్రెండ్ ని.. నువ్వు దూరంగా వెళ్తున్నావు.. తప్పుని కప్పి పుచ్చుకోవడానికి చూస్తున్నావు.. నువ్వు ఎలా మోసం చేస్తున్నావు కార్తీక్ అది నీ క్యారెక్టర్ కాదు.. పదేళ్లు ఒక అబద్దాన్ని నమ్మి దీపని పక్కన పెట్టావు.. ఇప్పుడు ఈ నిజాన్ని నమ్మకుండా మోనిత ను పక్కకు పెడతావు.. నేను పెళ్లిని వాయిదా వెయ్యను.. వద్దు నీ ఫ్రెండ్ గా చెబుతున్నా నువ్వు మోనిత ని పెళ్లి చేసుకొవడమే న్యాయం.. ఈ నిజం రోజు రోజుకీ పెరిగి.. ఏ పాపం తెలియని పసిబిడ్డగా కనిపిస్తుంది. అపుడు ఆ సాక్ష్యం పట్టుకుని కోర్టు మెట్లు ఎక్కడం బాగుంటుందా.. ప్రపంచానికి తెలియక ముందే నీ ఇంటి మెట్లు ఎక్కడం బాగుంటుందా.. నేను పెళ్లి వాయిదా వేయను.. పెళ్లి క్యాన్సిల్ చేయను.. నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి అయ్యిందని తెలిసినప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోదామనుకున్నా.. ఇప్పుడు ఈ పెళ్లి నా కోసం కాదు కార్తీక్.. పుట్టబోయే బిడ్డకోసం.. నేను పెళ్లి కావాలంటున్న న్యాయం ఎటువైపు ఉందొ నువ్వే ఆలోచించు.. నేను ఇంత మాట్లాడినా నీలో స్పందన లేదు కనుక మీ అమ్మగారిని న్యాయం అడుగుతా అంటే.. కార్తీక్ మా అమ్మలేదు అని అంటాడు ఎక్కడికి వెళ్ళింది అంటే అమెరికా వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని మోనిత అడిగితె.. మా చెల్లి దగ్గరికి చూసి చాలా రోజులైందని వెళ్ళింది అంటాడు కార్తీక్.. ఎందుకు వెళ్ళింది.. సాక్షి సంతకం పెట్టాల్సి వస్తుందని వెళ్లిందా అంటే.. అప్పుడు దీపని కూడా తన వెంట తీసుకెళ్లేది కదా అంటే.. ఎదో చేస్తున్నారు ఎదో కుట్ర చేస్తున్నారు.. అంటూ ఆవేశ పడుతుంది మోనిత మీ అమ్మ ఆ దీప కలిసి నా జీవితాన్ని నా కలలు సర్వనాశనం చేసేలా ఉన్నారు.. లాభం లేదు.. మోనిత మౌనంగా ఉన్నా కేర్లెస్ గా పని జరిగేలా లేదు.. చూసుకుంటాను.. నా సమస్యను నేనే పరిష్కారం చేసుకుంటా.. నువ్వు వేళ్ళు కార్తీక్ అంటే.. మోనిత చేయి పట్టి అవుతాడు. ఏమిటి అంటే.. నా చేయే కాదు.. నా జీవితం నీ చేతుల్లోనే ఉంది అంటే.. కార్తీక్ మోనిత చేయి వదిలేస్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఫ్యామిలీ సెల్ఫీ తీసుకుంటాడు.. దీప మీద ఒట్టేసి మరీ చెబుతాడు.. తన తప్పు లేదు. ఈ నెల 25 లోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దీపతో చెబుతున్నాడు కార్తీక్

Also Read: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‏కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu