ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. అకడమిక్ క్యాలెండర్, ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది...
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. అకడమిక్ క్యాలెండర్, ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఆకడిమిక్ క్యాలెండర్‌ను కూడా రూపొందించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలకు సమాచారాన్ని పంపించింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 213 పనిదినాలు ఉంటాయని.. ఈ నెల 12 నుంచి టీచర్లు కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు అకడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ కాగా.. ఆగష్టులో మొదటి యూనిట్ టెస్ట్‌ను పెట్టనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రెండో యూనిట్ టెస్ట్, అక్టోబర్ 1 నుంచి 8 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు ఉంటాయి. ఇక అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఫస్ట్ టర్మ్ సెలవులు. అక్టోబర్ 18 నుంచి కాలేజీల పున:ప్రారంభం అవుతాయి.
ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు అకడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ ఉంటుంది. నవంబర్ 3న మొదటి యూనిట్ టెస్ట్.. డిసెంబర్ 4న రెండో యూనిట్ టెస్ట్ ఉంటుంది. 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్ టర్మ్ సెలవులు ఉంటాయి. ఇక జనవరి 17న మళ్లీ కాలేజీలు పున: ప్రారంభం అవుతాయి.
ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ-ఫైనల్ పరీక్షలు, అదే నెల చివరి వారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం అవుతాయి. అటు మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఉంటాయని.. ఏప్రిల్ 23వ తేదీ లాస్ట్ వర్కింగ్ డే అని ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. కాగా, 2022 ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించింది. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. జూన్ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపింది. అలాగే అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించింది.
Also Read:
దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!
టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!
ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!