AP Schools Reopen: ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని..
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఆగష్టులోపు విద్యాసంస్థల్లో పెండింగ్ ఉన్న ‘నాడు నేడు’ పనులను పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని మంత్రి చెప్పుకొచ్చారు.
మరోవైపు ఇంటర్ సెకండియర్ మార్క్స్‌పై కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు మార్క్స్ మెమోలను జారీ చేస్తామని తెలిపారు.
కాగా, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయనుంది. అటు రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
Also Read:
దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!
టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!
ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!