EPFO New Rule: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

అసలే కరోనా.. ఆపై వర్షాకాలం.. ఇలాంటి తరుణంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డుపైకి వచ్చేటప్పుడు..

EPFO New Rule: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2021 | 12:10 PM

అసలే కరోనా.. ఆపై వర్షాకాలం.. ఇలాంటి తరుణంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డుపైకి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. పైగా పన్నుల బాదుడుతో సతమతమవుతున్న సామాన్యులకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే.. అంతంతమాత్రం జీతాలతోనే బ్రతుకు జట్కా బండిని లాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సామాన్య ప్రజానీకానికి తీపి కబురు అందిస్తూ ప్రభుత్వం తాజాగా కొత్త సేవను అమలులోకి తీసుకొచ్చింది.

ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పీఎఫ్ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి రూ. 1 లక్ష వరకు అడ్వాన్స్‌గా విత్ డ్రా చేసుకోవచ్చునని ఈపీఎఫ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు వారు ఎలాంటి అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. జూన్ 1వ తేదీ 2021, ఈపీఎఫ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. కరోనాతో సహా ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధి చికిత్స నిమిత్తంగా ఆసుపత్రిలో చేరినట్లయితే.. రూ. 1 లక్ష వరకు అడ్వాన్స్ కింద పీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకోవచ్చునని.. ఈ ప్రక్రియ గంట వ్యవధిలో పూర్తవుతుందని తెలిపింది.

ఇంతకుముందు, ఈపీఎఫ్ఓ మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం పీఎఫ్ ఖాతాను నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమతించింది. అయితే అది వ్యయ అంచనాల ఆధారంగా లేదా మెడికల్ బిల్స్ రీయింబర్స్‌మెంట్ తర్వాత మాత్రమే లభించేది. ఏదేమైనా, ఇప్పటి మెడికల్ అడ్వాన్స్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యుడు ఎలాంటి బిల్స్ లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఆ మొత్తం ఖాతాలోకి బదిలీ అయిపోతుంది.

ఈ అడ్వాన్స్‌ను తీసుకునేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సిజిహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. అతన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే.. అప్పుడు ఓ అధికారి పూర్తిగా పరిశీలించి రిపోర్ట్ అందించిన తర్వాత మెడికల్ అడ్వాన్స్ జారీ చేయబడుతుంది.

2. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా రోగి, అతన్ని చేర్పించిన ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ ఓ అప్లికేషన్‌ను సమర్పించాలి. అంచనా వ్యయం ఏమి లేదని పేర్కొనాలి. దానితో మెడికల్ అడ్వాన్స్ మంజూరు అవుతుంది.

3. మెడికల్ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేసుకున్న గంటలోపే ఆ డబ్బు ఖాతాదారుడి అకౌంట్‌లోకి బదిలీ అవుతుంది.

4. ఈ అడ్వాన్స్ కోవిడ్ 19 అడ్వాన్స్ కంటే భిన్నమైనది.

Also Read:

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!

సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్‌ క్యాలెండర్‌ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..