AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

ప్రతిరోజు రాత్రి సమయాల్లో రైతు ఫామ్‌లో కోళ్లు మాయం అయిపోతుందేవి. ఆ పని ఎవరిదా.! అని తెలుసుకునేందుకు బోను ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో ..

AP News: రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!
Ravi Kiran
|

Updated on: Jul 08, 2021 | 1:38 PM

Share

అడవిలో ఎన్నో పళ్లు తింటూ.. తిరిగే మానుపిల్లి.. జనారణ్యంలోకి వచ్చి బోనుకు చిక్కింది. చెట్లపై దొరికే జామకాయలు, పామాయిల్ కాయలు ఇతర చెట్లకు దొరికే వివిధ రకాల పండ్లను ఈ మానుపిల్లి తిని బ్రతుకుతుంది. అయితే దారి తప్పిందో.. అడవిలో ఆహారం కొరత ఏర్పడిందో.. కాని మానుపిల్లి ఏలూరులోకి వచ్చేసింది. ఏలూరు రూరల్ తూర్పు లాకుల నుండి పాలగూడెం వెళ్లే రోడ్డులో నివసించే రామకృష్ణ అనే రైతు కోళ్ల ఫామ్‌లో ఈ మానుపిల్లి ప్రత్యక్షమైంది.

ప్రతిరోజు రాత్రి సమయాల్లో రైతు ఫామ్‌లో కోళ్లు మాయం అయిపోతుందేవి. ఆ పని ఎవరిదా.! అని తెలుసుకునేందుకు బోను ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో ఆశ్చర్యంగా మానుపిల్లి పడింది. ఇది మామూలు పిల్లికి భిన్నంగా ఉండటంతో భయాందోళనకు గురైన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ముందు మానుపిల్లిని చూసి అందరూ పునుగుపిల్లిగా భ్రమపడ్డారు. అయితే అటవీశాఖ అధికారి సత్యనారాయణ అక్కడకు చేరుకుని అది పునుగుపిల్లి కాదని నిర్ధారించారు. దీన్ని మానుపిల్లి, చెట్లపిల్లి అంటారని చెప్పారు. దీన్ని పెదవేగి ప్రాంతంలోని అడవిలో విడిచిపెడతామని తెలిపారు. పొలం గట్ల వెంబడే ప్రయాణించి ఇది ఏలూరులోకి వచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!

సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్‌ క్యాలెండర్‌ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!

Cat Ap