AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిమ్ వికృత చేష్టలకు ఆ రూమ్ అడ్డా.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు.. సంగతి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kim Jong Un: నార్త్ కొరియా.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది కిమ్ జాంగ్ ఉన్. ఈ డిక్టేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన చేసే చేష్టలు..

కిమ్ వికృత చేష్టలకు ఆ రూమ్ అడ్డా.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు.. సంగతి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Kim Jong-un
Ravi Kiran
|

Updated on: Jul 09, 2021 | 8:47 AM

Share

నార్త్ కొరియా.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది కిమ్ జాంగ్ ఉన్. ఈ డిక్టేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. ఇదిలా ఉంటే కిమ్ లైఫ్ స్టైల్ అసలు ప్రపంచంలో ఎవరీకి ఉండదని చెప్పాలి. ఒకవైపు దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. ఈయన మాత్రం పూర్తి వ్యతిరేకంగా తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు అన్ని హైబ్రాండ్స్ వాడుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఆయన తినే ఆహార పదార్ధాలన్నీ కూడా విదేశాల నుంచే తెప్పించుకుంటారు.

ఇదిలా ఉంటే కిమ్‌కు ఖరీదైన కార్లు, వాచీలు అంటే చాలా ఇష్టం. అందుకే వాటిని ప్రతీసారి కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. నార్త్ కొరియా ఆయన ఉండటానికి 17 ప్యాలెస్‌లు ఉండగా.. ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఏకంగా 130 డాక్టర్లతో కూడిన ఓ పెద్ద ఆసుపత్రి ఉంది. ఇక కిమ్ పెంపుడు జంతువుల పాలన కోసం దేశ బడ్జెట్‌లో 20 శాతం నిధులను కేటాయించారు. అలాగే ఈ డిక్టేటర్ రాజభోగాలకు దేశ ప్రభుత్వం అన్ని విధాల ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇక అందులో సింహభాగం రూమ్ నెంబర్ 39 నుంచి వస్తుంది. అసలు ఇంతకీ ఆ రూమ్ నెంబర్ 39 ఏంటి.? అక్కడ నుంచి ఆదాయం రావడమేంటన్నది ఇప్పుడు చూద్దాం..

రూమ్ నెంబర్ 39 ఏంటి.?

రూమ్ నెంబర్ 39.. దీనినే బ్యూరో 39, డివిజన్ 39 అని పిలుస్తుంటారు. దీని అసలు పేరు సెంట్రల్ కమిటీ బ్యూరో 39 ఆఫ్ ది వర్కర్స్ పార్టీ అఫ్ కొరియా. ఈ రూమ్‌ను 1970 సంవత్సరంలో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ ప్యాంగ్యాంగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేశారు. అప్పట్లో నార్త్ కొరియా ఖజానా అంతా కూడా ఇక్కడ నుంచే వచ్చేది. సాధారణంగా ఉత్తర కొరియా నుంచి బంగారం, బొగ్గు, వస్త్రాలు, పుట్టగొడుగులు, ఇతర ఆహార పదార్ధాలు, ఆయుధాల తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. వాటి ద్వారా దేశానికి వచ్చే ఆదాయపు లెక్కలన్నీ కూడా ఈ రూమ్ నెంబర్ 39 చూసుకునేది. అప్పట్లో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ శాఖలో భాగంగా ఉండే ఈ గది ఇప్పుడు అక్రమ సంపాదనకు నిలయంగా మారింది.

ఈ గది ద్వారా వచ్చే ఆదాయ వనరులపై కొన్నాళ్ల తర్వాత విభేదాలు తలెత్తడంతో రూమ్ నెంబర్ 38, రూమ్ నెంబర్ 39గా డివైడ్ చేశారు. దేశానికి వచ్చే న్యాయపరమైన ఆదాయం అంతా కూడా రూమ్ నెంబర్ 38 చూసుకుంటుంటే.. అక్రమ వ్యాపారాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ, ఆయుధాల అక్రమ రవాణా, ఇతరత్రా వ్యవహారాల నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తం రూమ్ నెంబర్ 39 చూసుకుంటోంది. ఆ ఆదాయాన్ని కిమ్ విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ పలు వార్తలు కూడా గుప్పుమన్నాయి. ప్రపంచ మీడియాలో సైతం కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!