AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: టీకా తీసుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.. కంపెనీలను మూసివేస్తాం.. ఆ దేశం కొత్త రూల్స్‌

Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే మరో వైపు డెల్టా వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి

Covid-19 Vaccine: టీకా తీసుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.. కంపెనీలను మూసివేస్తాం.. ఆ దేశం కొత్త రూల్స్‌
Covid Vaccine
Subhash Goud
|

Updated on: Jul 09, 2021 | 9:38 AM

Share

Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే మరో వైపు డెల్టా వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్‌ టీకా వేసుకోవాలని సూచిస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని దేశాలు మాత్రం ఉద్యోగులకు వ్యాక్సిన్‌ విషయంలో కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. ఉద్యోగులు తప్పనిసరిగా కోవిడ్‌ టీకా తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇక దక్షిణ పసిఫిక్‌ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆగస్టు 15వ తేదీ లోపు మొదటి డోసు తీసుకోకపోతే సెలవుపై వెళ్లాలని, నవంబర్‌ 1లోగా రెండో డోసు తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు ఫిజి ప్రధాన మంత్రి ఫ్రాంక్ బైనీమారామ స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగులు ఆగస్టు 1 నాటికి తమ మొదటి డోసు తీసుకుని ఉండాలని, లేకపోతే భారీగా జరిమానాలు, కఠిన చర్యలు ఉంటాయని, అంతేకాకుండా వ్యాక్సినేషన్‌ కానీ కంపెనీలను మూసివేయబడతాయని హెచ్చరించారు.

కాగా, దక్షిణ పిసిఫిక్‌ దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 340,000 మందికి టీకాలు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ తీసుకోలేని వారు తప్పకుండా తీసుకోవాలని ఆ దేశం సూచిస్తోంది. కాగా, కోవిడ్ వైరస్‌ రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కోవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి డెల్టా వేరియంట్‌ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాయి పలు దేశాలు. రానున్న థర్డ్‌ వేవ్‌లో మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేసే విధంగా చర్యలు చేపడుతున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Delta Variant: వ్యాక్సిన్‌ తీసుకుంటే డెల్టా వేరియంట్‌ నుంచి తప్పించుకోవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి

Covid-19 Vaccine Update: దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్.. 37 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ

Follow Us
గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన..
గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..