AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!

OnePlus Nord 2: పలు మొబైక్‌ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కొత్త కొత్త మోడళ్ల మొబైల్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త..

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!
Oneplus Nord 2
Subhash Goud
|

Updated on: Jul 08, 2021 | 10:55 AM

Share

OnePlus Nord 2: పలు మొబైక్‌ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కొత్త కొత్త మోడళ్ల మొబైల్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మొబైల్‌లను తయారు చేస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్‌ నార్డ్‌ -2 స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ లీకైంది. ఈ మొబైల్‌ జూలై చివరి వారంలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన డిజైన్‌, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. లీకైన వివరాల ప్రకారం.. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఏఐ బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉండనుంది. ఇక ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ ప్రకారం.. ఈ ఫోన్ జులై 24వ విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ ఆరోజున మనదేశంలో కూడా విడుదల కానుందా..? లేక వేరే దేశాల్లో లాంచ్‌ కానుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ జూలైలో విడుదల కానున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి.

వన్‌ప్లస్ నార్డ్ 2 స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దీని స్పెసిఫికేషన్లు ఇప్పటికే పలుమార్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. గతంలో లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. అలాగే 6.43 అంగుళాల, హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్‌లో వెనకవైపు మూడు కెమెరాలు, వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇందులో 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నట్లు సమాచారం.

ఇవీ కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!

Nokia G20: భారత్‌ మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్ విడుదల..అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?