RBI: ఎస్‌బీఐతో పాటు మరో 13 బ్యాంకులకు ఝలక్‌ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా విధింపు.. ఎందుకంటే..!

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ బ్యాంకులకు భారీగా జరిమానా విధిస్తోంది..

RBI: ఎస్‌బీఐతో పాటు మరో 13 బ్యాంకులకు ఝలక్‌ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా విధింపు.. ఎందుకంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 08, 2021 | 11:33 AM

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ బ్యాంకులకు భారీగా జరిమానా విధిస్తోంది. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)తో పాటు మరో 13 బ్యాంకులకు షాకిచ్చింది ఆర్బీఐ. ఈ బ్యాంకులన్నింటి భారీ జరిమానా విధించింది. నిబంధనల అతిక్రమించినందుకు గానూ ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రుణాలు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వంటి పలు అంశాలకు సంబంధించి బ్యాంకులు రూల్స్ అతిక్రమించడం కారణంగా జరిమానా విధించామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తెలిపింది. ఇందులో దేశీ దిగ్గజ బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ కూడా ఉండటం గమనార్హం.

బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.2 కోట్లు, ఇతర బ్యాంకులకు రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రూ.కోటి జరిమానా విధించిన బ్యాంకుల్లో.. బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్రెడిట్ సూసీ ఏజీ, ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కర్నాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, పంజాన్ అండ్ సింద్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి.

ఇకపోతే రిజర్వు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.50 లక్షల వరకు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 47 ఏ (1) (సీ), సెక్షన్ (4) (ఐ), సెక్షన్ 51 (1) కింద జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది.

Rbi

ఇవీ కూడా చదవండి:

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!

Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు