Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో..

Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 08, 2021 | 9:43 AM

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం 2016లో దేశవ్యాప్తంగా 983 రైల్వేస్టేషన్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం 813 స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన రైల్వేస్టేషన్లలో కెమెరాల ఏర్పాటు తుదిదశలో ఉందని, ‘నిర్భయ’ నిధుల నుంచి ఈ పథకం అమలుచేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి మరో 756 రైల్వే స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గత ఏడాది జూన్‌ 25వ తేదీన రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీలను ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 456 రైల్వే స్టేషన్‌లలో పూర్తి చేయడానికి ఈ ఏడాది మే నెలలో నాలుగు టెండర్లను వేసింది. రైల్వే ప్రాంగణంలో మెరుగైన భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, వీడియో ఫీడ్లను పర్యవేక్షిస్తున్నారు రైల్వే అధికారులు.

రైల్‌టెల్ ప్రకారం.. నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్‌ఎంఎస్) ద్వారా కెమెరాలు, సర్వర్, యుపిఎస్, స్విచ్‌ల పర్యవేక్షణ కొనసాగుతుంది. వీటిని ఏ వెబ్ బ్రౌజర్ నుండి అయినా సిబ్బంది చూడవచ్చు. రైల్వే ప్రాంగణంలో గరిష్ట కవరేజీని నిర్ధారించడానికి, డోమ్ రకం, బుల్లెట్ రకం, పాన్ టిల్ట్ జూమ్ రకం, అల్ట్రా హెచ్‌డి -4 కెతో సహా నాలుగు రకాల ఐపీ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రతను మెరుగుపరిచేందుకు ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్‌టెల్ తెలిపింది. అయితే సీసీటీవి కెమెరాల నుండి వీడియో ఫీడ్ రికార్డింగ్‌లు 30 రోజుల పాటు నిల్వ చేయబడతాయి.

ఇవీ కూడా చదవండి

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!