Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్ము కశ్మీరులోని పుల్వామా జిల్లా పూచల్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పూచల్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే...

Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
Kashmir Encounter
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2021 | 10:16 AM

జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..మనదేశంలోకి చొచ్కుకొచ్చేందుకు.. భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే భారత సరిహద్దుల వెంట హై టెక్నాలజీ కెమెరాలను, సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశం సరిహద్దులు దాటుకుని వచ్చేందుకు కొందరు టెర్రరిస్టులు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా భారత జవాన్లపైకి కాల్పులకు తెగబడుతున్నారు.

జమ్ము కశ్మీరులోని పుల్వామా జిల్లా పూచల్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పూచల్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు బుధవారం రాత్రి గాలింపు ప్రారంభించాయి. గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ ఐజీ విజయకుమార్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. కుల్గాం ప్రాంతంలోని జోడార్ వద్ద బుధవారం జరిగిన మరో ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.

టెర్రరిస్టులు, భద్రతాబలగాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. 24 గంటల్లో భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు. కుల్గాంలో ఇద్దరు, పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇక కుప్వారా జిల్లాలో ఇరువర్గాల మధ్య జరిగిన ఫైరింగ్‌లో..హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద ముఠాకు చెందిన కమాండర్‌ ఉబాయిద్‌ హతమయ్యాడు.

ఇవి కూడా చదవండి: Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..

G Kishan Reddy: అందుకే నాకు ప్రమోషన్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌