Haiti president : హైతీ అధ్యక్షుని హత్య ఘటన.. నలుగురు అనుమానితుల కాల్చివేత..మరో ఇద్దరి అరెస్ట్
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిజ్ హత్యకు పాల్పడ్డారని భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు కాల్చి చంపారు. మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా దుండగులు బందీలుగా పట్టుకున్న ముగ్గురు పోలీసులను వారి చెర నుంచి విడిపించారు. జొవెనెల్ పై కాల్పులు జరుపుతుండగా...
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిజ్ హత్యకు పాల్పడ్డారని భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు కాల్చి చంపారు. మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా దుండగులు బందీలుగా పట్టుకున్న ముగ్గురు పోలీసులను వారి చెర నుంచి విడిపించారు. జొవెనెల్ పై కాల్పులు జరుపుతుండగా గాయపడిన ఆయన భార్య మార్టిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న ఈ అధ్యక్షుడిని ఆయన ప్రైవేట్ రూమ్ లోనే కిల్లర్స్ హతమార్చినట్టు తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మందుగుండు సామాగ్రిని, తూటాలను కనుగొన్నట్టు ఆయన చెప్పారు. పోలీసులు, భద్రతా దళాలు సెక్యూరిటీని పెంచినట్టు ఆయన వెల్లడించారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు . 11 మిలియన్ల జనాభా గల హైతీ రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దుండగులు ఇళ్లను దోచుకుని వాటికీ నిప్పు పెడుతున్నారు. దీంతో సుమారు 15 వేలమంది ఇళ్ళు వదిలి పారిపోయారు. రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ లో ఈ దారుణాలు మరీ ఎక్కువగా సాగుతున్నాయి. గత నెల 29 న జరిగిన కాల్పుల్లో ఓ జర్నలిస్టు.. ఓ పొలిటికల్ నేత తో సహా 15 మంది మరణించారు.
ఆహార కొరత హైతీని తీవ్రంగా బాధిస్తోంది. ఆర్ధిక వ్యవస్థ దిగజారి పోవడంతో అనేకమంది లూటీలకు పాల్పడుతున్నారు. ప్రజలు రోజుకు 2 డాలర్లకు మించి సంపాదించలేకపోతున్నారు. నిత్యావసరాల వస్తువులు దొరకక వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధ్యక్షుని కాల్చివేతపై విపక్షాలు ఇప్పటివరలకు నోరెత్తలేదు. ఎవరూ ఖండించకపోవడం గమనార్హం.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆదర్శ వివాహం..అత్తమామల కన్యాదానం..తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయికి పెళ్లి..(వీడియో).: Nepal marriage Viral video.
News Watch Video: మోడీ ఎన్నికల కేబినెట్,మరిన్ని వార్తా కధనాల సమాహారం (వీడియో).