AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Choutuppal: విషాదం.. ముగ్గురు పిల్లలకు ఉరివేసి.. బలవన్మరణానికి పాల్పడిన తల్లి..

Mother childrens Dead: తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం నెలకొంది. ఓ తల్లి.. ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో

Choutuppal: విషాదం.. ముగ్గురు పిల్లలకు ఉరివేసి.. బలవన్మరణానికి పాల్పడిన తల్లి..
Choutuppal
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2021 | 9:27 AM

Share

Mother childrens Dead: తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం నెలకొంది. ఓ తల్లి.. ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి చెందింది. ఓ చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. చీర ఉచ్చు మెడ నుంచి జారడంతో ఆ చిన్నారి తప్పించుకుంది. ఈ ఘటన చౌటప్పల్‌లోని రామ్‌నగర్‌లో జరిగింది. రామ్ నగర్‌కు చెందిన వెంకటేశ్‌, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సమతమతమవుతోంది. ఓ వైపు కుటుంబాన్ని పోషించడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో రాణి మానసికంగా కుంగిపోయింది.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. చిన్న కుమార్తె శైనీ మెడ నుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణి (31) తోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి (13), లక్కీ (11) ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read:

Crime: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం