AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

Woman Gang-raped: అపార్ట్‌మెంట్‌లో మహిళ ఒంటరిగా ఉన్నది గమనించారు.. అనంతరం కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దారుణానికి

Crime: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2021 | 7:08 AM

Share

Woman Gang-raped: అపార్ట్‌మెంట్‌లో మహిళ ఒంటరిగా ఉన్నది గమనించారు.. అనంతరం కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. నగరంలోని గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైనా తెలిసిన వారి పనై ఉంటుందా అనే కోణంలోనూ విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. సామూహిక అత్యాచారం అనంతరం రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లారన్నారు.

ఈ ఘటన అనంతరం బాధితురాలు గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కేసును కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తు చేస్తోంది. అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ ఫ్లాట్‌ నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించింది. అలాగే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Cancer : శరీరానికి ఎండ తగలకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం..! పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 27 మంది ఓబీసీలకు చోటు.. ఏ ఏ కులాలకు అవకాశం దక్కిందంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..