Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 27 మంది ఓబీసీలకు చోటు.. ఏ ఏ కులాలకు అవకాశం దక్కిందంటే..

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజన సంఘ ప్రతినిధులు,

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 27 మంది ఓబీసీలకు చోటు.. ఏ ఏ కులాలకు అవకాశం దక్కిందంటే..
Pm Narendra
Follow us
uppula Raju

|

Updated on: Jul 08, 2021 | 5:50 AM

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజన సంఘ ప్రతినిధులు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించారు. 27 మంది ఓబీసీ ఎంపీలను మంత్రులుగా చేశారు. ఈ మంత్రివర్గ విస్తరణలో యువనాయకులకు, అనుభవజ్ఞులకు చోటు కల్పించారు. దీని ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాలనను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. 15 రాష్ట్రాలకు చెందిన 27 మంది ఓబీసీ ఎంపీలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు.

యాదవ్, కుర్మి, జాట్, గుర్జార్, ఖండయత్, భండారి, బైరాగి, టి ట్రైబ్, ఠాకూర్, కోలి, వోక్కలిగా తులు గౌడ, ఈజావా, లోధ్, అగ్రి, వంజరి, మీటీ, నాట్, మల్లా-నిషాద్ వంటి కులాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గం హర్ష్ వర్ధన్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్లకు ఉద్వాసన పలికారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత మంత్రుల మండలిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రమే పాత సభ్యుడు. 1998, 2004 నాటి వాజ్‌పేయి ప్రభుత్వాలలో కూడా పనిచేశారు.

ఈ విస్తరణలో ఉత్తర ప్రదేశ్ నుంచి గరిష్టంగా ఏడుగురు మంత్రులకు స్థానం కల్పించారు. వీరిలో ఎక్కువ మంది రిజర్వు కుల వర్గానికి చెందినవారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రుల మండలిలో చేర్చబడిన 36 కొత్త ముఖాల్లో, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఈ రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున ఎంపీలకు మంత్రుల మండలిలో స్థానం లభించింది. గుజరాత్‌కు చెందిన ముగ్గురు నాయకులకు, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశాకు చెందిన ఇద్దరు నాయకులను మంత్రులుగా చేయగా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, త్రిపుర, న్యూ ఢిల్లీ, అస్సాం, రాజస్థాన్, మణిపూర్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు మంత్రుల మండలిలో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మందిని సహాయ మంత్రులుగా నియమించారు.

ఏడుగురు సహాయ మంత్రులకు పదోన్నతి కల్పించి కేబినెట్ మంత్రులుగా చేశారు. వీరిలో అనురాగ్ సింగ్ ఠాకూర్, జి. కిషన్ రెడ్డి, ఆర్కె సింగ్, హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ఇప్పటివరకు ఏ పరిపాలనా అనుభవం లేని ఏకైక మంత్రి భూపేంద్ర యాదవ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విస్తరణలో త్రిపుర, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాలకు కూడా ప్రధాని స్థానం ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మిత్రులను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణలో బీహార్‌కు చెందిన జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీలోని పరాస్ వర్గానికి చెందిన పశుపతి కుమార్ పరాస్‌లను కేబినెట్ మంత్రులుగా చేశారు. ఇద్దరూ బీహార్‌కు చెందినవారు.

మంత్రుల మండలి విస్తరణలో ఏడుగురు మహిళలకు స్థానం కల్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలతో పాటు కేంద్ర మంత్రుల మండలిలో మొత్తం మహిళా మంత్రుల సంఖ్య ఇప్పుడు తొమ్మిదికి పెరిగింది. మొత్తం 15 మంది సభ్యులు కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మేలో 57 మంది మంత్రులతో ప్రధానిగా పదవీకాలం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రుల మండలిని విస్తరించారు.

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం..! 50 ఏళ్ల కన్నా తక్కువున్న 9 మందికి అవకాశం..

పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చా..! అసలు పిడుగు అంటే ఏమిటీ.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి..

Nishith Pramanik : మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం..