Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం..! 50 ఏళ్ల కన్నా తక్కువున్న 9 మందికి అవకాశం..

Cabinet Expansion 2021 : 2019 సంవత్సరంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మంత్రివర్గాన్ని

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం..! 50 ఏళ్ల కన్నా తక్కువున్న 9 మందికి అవకాశం..
8 Young Minister
Follow us

|

Updated on: Jul 08, 2021 | 4:24 AM

Cabinet Expansion 2021: 2019 సంవత్సరంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించారు. కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేరిన మంత్రులు చాలామంది ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేబినెట్‌లో కొత్తగా యువకులు చేరారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 7గురి వయసు 50 సంవత్సరాల కన్నా తక్కువ. మొత్తం సంఖ్య గురించి మాట్లాడితే.. కేబినెట్‌లో తక్కువ వయస్సు ఉన్న 9 మంది మంత్రులు ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్ వయస్సు 50 సంవత్సరాలు.

కేబినెట్ విస్తరణ తర్వాత 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 43 మంది మంత్రులలో 9 మంది మంత్రుల వయస్సు 50 సంవత్సరాల కన్నా తక్కువ. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూచ్ బెహర్ ఎంపీ నిషిత్ ప్రమానిక్ మోదీ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడు. ఆయన వయసు 35 సంవత్సరాలు. బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల శాంతను ఠాకూర్‌ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. శాంతను బంగాన్ సీటు నుంచి గెలిచి 2019 లో తొలిసారిగా లోక్‌సభకు చేరుకున్నారు. అతను మాతువా సమాజంలోని పెద్ద నాయకులలో ఒకడు. యూపీకి చెందిన అప్నా దళ్ ఎంపీ 40 ఏళ్ల అనుప్రియా పటేల్‌ కూడా మంత్రి అయ్యారు.

మహారాష్ట్రలోని దిందోరికి చెందిన ఎంపీ భారతి ప్రవీణ్ పవార్ (42) ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇతడు ఎంబిబిఎస్ డాక్టర్ కూడా. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన తమిళనాడుకు చెందిన పొన్ రాధాకృష్ణన్ తర్వాత ఎల్ మురుగన్ రెండో నాయకుడు. అతని వయస్సు 44 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్‌కు చెందిన బీజేపీ ఎంపీ జాన్ బార్లా వయసు 45 సంవత్సరాలు ఆయన కూడా మంత్రి అయ్యారు. హిమాచల్‌లోని హమీర్‌పూర్ సీటుకు చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ 46 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనురాగ్ ఠాకూర్‌తో పాటు, కిరెన్ రిజిజును కూడా కేబినెట్ మంత్రిగా చేశారు. రిజిజు వయసు 49 సంవత్సరాలు. మంత్రి మన్సుఖ్ మాండవియా వయసు కూడా 49 సంవత్సరాలు.

61 ఏళ్లు పైబడిన వారికి కూడా అవకాశం.. మంత్రివర్గంలో అనుభవజ్ఞులైన ఎంపీలకు కూడా మోదీ చోటు కల్పించారు.61 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 11 మంది మంత్రులు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉన్నారు. నారాయణ్ రాణే, హర్దీప్ సింగ్ పూరి అత్యధిక వయసు గల మంత్రులలో ఉన్నారు. వీరి వయస్సు 69 సంవత్సరాలు. కేబినెట్ విస్తరణ తరువాత హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేటాయించారు.

లక్నో ఎంపీ కౌషల్ కిషోర్, ఎస్పీ సింగ్ బాగెల్ 61 సంవత్సరాల వయసులో మంత్రులయ్యారు. భాను ప్రతాప్ సింగ్ వర్మ, ఆర్‌సిపి సింగ్ వయసు 63 సంవత్సరాలు. ఎ. నారాయణస్వామి, భగవత్ కిషన్రావ్ కరాడ్ వయస్సు 64. పురుషోత్తం రూపాల వయసు 66. మంత్రి సుభాష్ సర్కార్, డాక్టర్ వీరేంద్ర కుమార్ వయసు 67 సంవత్సరాలు. రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ఎల్‌జెపి ఎంపీ పశుపతి పరాస్ వయసు 68 సంవత్సరాలు.

Young woman died : కూకట్‌పల్లిలో ఘోరం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలి

తనపై విచారణను రద్దు చేయాలంటూ డొమినికా కోర్టుకెక్కిన మెహుల్ చోక్సీ …భారత అధికారులపై కొత్త ఆరోపణ

Varity Robbery Attempt: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగ.. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవాటానికి గొడుగుతో కవరింగ్