తనపై విచారణను రద్దు చేయాలంటూ డొమినికా కోర్టుకెక్కిన మెహుల్ చోక్సీ …భారత అధికారులపై కొత్త ఆరోపణ
తనపై చేపట్టిన ప్రొసిడింగ్స్ ను కొట్టివేయాలంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా హైకోర్టులో పిటిషన్ వేశాడు. భారత ప్రభుత్వ అధికారులు ఆదేశించడం వల్లే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని ఆయన ఆరోపించాడు. తనపై పెట్టిన కేసు చెల్లదని ప్రకటించాలని, తన ఆవేదనను ఇక్కడి పోలీసులకు..
తనపై చేపట్టిన ప్రొసిడింగ్స్ ను కొట్టివేయాలంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా హైకోర్టులో పిటిషన్ వేశాడు. భారత ప్రభుత్వ అధికారులు ఆదేశించడం వల్లే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని ఆయన ఆరోపించాడు. తనపై పెట్టిన కేసు చెల్లదని ప్రకటించాలని, తన ఆవేదనను ఇక్కడి పోలీసులకు చెప్పినా వారు ఆలకించలేదని అన్నాడు. పైగా భారత అధికారుల మీద నేను చేసిన ఆరోపణలను కూడా వారు వినలేదని, ఏక పక్షంగా ప్రవర్తించారని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. డొమినికాలో నేను అక్రమంగా ప్రవేశించానని అంటున్నారు… కానీ ఈ ఆరోపణపై శాశ్వతంగా స్తే ఇవ్వాలని కోరుతున్నానని ఆయన అన్నాడు. 2018 నుంచి ఆంటిగ్వా లో ఉంటున్న మెహుల్ చోక్సీ…గత మే 23 న క్యూబాకు వెళ్తుండగా డొమినికా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇతడిని నిషేధిత ఇమ్మిగెంటుగా డొమినికా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఈయనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
తనను భారత ప్రభుత్వానికి అప్పగించరాదంటూ మెహుల్ చోక్సీ లోగడ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది.. అటు భారత ప్రభుత్వ అధికారులు ఆదేశించడం వల్లే తనను ఇక్కడి పోలీసులు అరెస్టు చేశారని చోక్సీ ఆరోపించడం ఇదే మొదటిసారి. భారత ప్రభుత్వంపై ఏదో విధంగా ఆయన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాడనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. లోగడ ఇండియా నుంచి 8 మంది అధికారుల బృందం ఆయనను డొమినికా నుంచి ఇండియాకు తీసుకురావడానికి చేసిన యత్నం విఫలమైంది. అదే జరిగి ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆకట్టుకుంటున్న రెడీమేడ్ హౌస్..తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలతో కదిలే ఇల్లు..(వీడియో): Readymade House Video.