AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Kishan Reddy: అందుకే నాకు ప్రమోషన్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. 

G Kishan Reddy: అందుకే నాకు ప్రమోషన్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Kishan Reddy
Sanjay Kasula
|

Updated on: Jul 07, 2021 | 10:12 PM

Share

కేంద్రమంత్రిగా తనపై గురుతర బాధ్యత ఉంటుందని చెప్పారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న దాని గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. జల వివాదం పరిష్కరించాల్సిన తనదేనని చెప్పారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం తెలుగువాడిగా గర్వంగా ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. కేంద్రమంత్రిగా తనపై గురుతర బాధ్యత ఉంటుందని చెప్పారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న దాని గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. జల వివాదం పరిష్కరించాల్సిన తనదేనని చెప్పారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం తెలుగువాడిగా గర్వంగా ఉందని చెప్పారు.

రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు.

తనపై విశ్వసం ఉంచిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తనపై విశ్వాసం వుంచిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని అంచనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

తనకు మార్గదర్శనం చేసిన అమిత్ షాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా చేపట్టిన అనేక నిర్ణయాలను , అనేక రకాల చట్టాలను రూపకల్పలన చేయడంలో తన వంతు ప్రయత్నం చేశాననన్నారు. గడిచిన రెండేళ్లలో కేంద్రప్రభుత్వం ద్వారా జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన అనిశ్చిత పరిస్ధితి, తీవ్రవాద కార్యకలాపాల మధ్య ప్రజల జీవనం కొనసాగుతున్న పరిస్ధితుల్లో ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. దీనిపై భారతీయ జనసంఘ్ కాలం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. తమ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చామన్నారు.

అనంతరం సీఏఏ, హోంశాఖ నుంచి ఎన్నో బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టానని కిషన్ రెడ్డి తెలిపారు. తన జీవితంలో ఈ రెండు సంవత్సరాలు పనిచేయడం మరిచిపోలేని సంఘటన అన్నారు. మంత్రిత్వ శాఖలో ప్రమోషన్, కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా కావాలని తాను ఎవరిని కోరలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తనకు కేబినెట్ మినిస్టర్‌గా అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. తనతో పాటు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారేనని కిషన్ రెడ్డి వెల్లడించారు.

సామాన్య కార్యకర్తలకు బీజేపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఏపీ, తెలంగాణలకు కేబినెట్ మంత్రిగా అందుబాటులో వుంటానని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపైనా కిషన్ రెడ్డి స్పందించారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో జంటనగరాల్లో సంబరాలు జరిగాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమోట్ అయ్యారంటే.. ఆయన కృషీ పట్టుదలే కారణం. అంతగా ఆయన తన శాఖ బాద్యతలను నిర్వహించి మోదీ కంట్లో పడ్డారు.. ప్రొమోషన్ పొందారు.. అంచెలంచెలుగా ఎదిగి నేడు కేంద్ర మంత్రి హోదాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.