రోడ్డుపక్కన బాలిక చిరు వ్యాపారం.. అన్ని రోజులు ఇలా ఉండవు.. బాగా చదివి పోలీస్ అవుతానంటున్న చదువుల తల్లి

రోడ్డుపక్కన బాలిక చిరు వ్యాపారం.. అన్ని రోజులు ఇలా ఉండవు.. బాగా చదివి పోలీస్ అవుతానంటున్న చదువుల తల్లి
New Delhi Girl

New Delhi Girl: రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు..కొంతమందికి ఎన్ని అవకాశాలున్నా .. వాటిని సద్వినియోగం చేసుకోకుండా లేని దానికోసం ఆరాట పడతారు. మరికొందరు.. ఉన్న అవకాశాలను..

Surya Kala

|

Jul 07, 2021 | 9:24 PM

New Delhi Girl: రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు..కొంతమందికి ఎన్ని అవకాశాలున్నా .. వాటిని సద్వినియోగం చేసుకోకుండా లేని దానికోసం ఆరాట పడతారు. మరికొందరు.. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని తమకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకుంటారు.. ఇంకొందరు.. తాము ఎదగడానికి అవకాశం లేకపోతె.. ఆ అవకాశాలను సృష్టించుకోవడం కోసం.. తమ బంగారు భవిష్యత్ ను ఏర్పరచుకోవడం కోసం నిరంతరం కష్టపడతారు. కృషి ఉంటె మనుషులు సాధించలేనిది ఏమీ లేదని లోకానికి చాటి చెబుతారు,

కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అగమ్య గోచరంగా మారాయి. ఈ మహమ్మారి ఎందరినో బలి తీసుకుంది. మరెందరికో జీవనోపాధి లేకుండా చేసింది. ముఖ్యంగా ఆర్ధిక రంగంతో పాటు చదువులపై కూడా భారీగా ప్రభావం చూపించింది కరోనా. మనదేశంలో సామాన్యులు ఉపాధి కోల్పోయారు. దీంతో తల్లిదండ్రులకు అండగా పిల్లలు తమకు తోచిన పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది చిన్నారులు కుటుంబం పోషణ కోసం తల్లిదండ్రులకు అండగా పనులు చేస్తూ.. అదే సమయంలో ఖాళీ ఉంటె తమ చదువును కొనసాగిస్తున్నారు. ఇటువంటి విద్యార్థుల గురించి తెలుసుకున్నప్పుడు ఓ వైపు అయ్యో అనిపించినా.. వారికీ చదువు మీద ఉన్న శ్రద్ధ.. పట్టుదల చుస్తే.. సాయం చేయాలనీ ఎవరికైనా అనిపిస్తుంది.

తాజా దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్‌ అనే ప్రాంతంలోని కేజీ మార్గ్‌ ఉంది. ఇది ఎప్పుడూ ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఓ బాలిక ఎంతో శ్రద్దగా చదువుకుంటుంది. ఆ బాలిక తల్లిదండ్రుల ఉపాధిని కరోనా రక్కసి మింగేసింది. దీంతో బాలిక చదువుకోవడం కష్టమైంది. ఆ బాలిక పేరు భూమిక .. తన ఇద్దరు సోదరిలతో కలిసి పీరాగర్హిలో ఉన్న సర్వోదయ కన్యా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. కుటుంబం గడవడానికి భూమిక ఇద్దరి సోదరిలు తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు.

అయితే భూమిక మాత్రం ఫుట్‌పాత్‌ మీద పక్షుల కోసం ఆహారం విక్రయిస్తోంది. మరోవైపు చదువుకుంటుంది. ఇదే విషయంపై భూమిక స్పందిస్తూ.. తాను ఓవైపు బర్డ్‌ ఫుడ్‌ అమ్ముతూ, మరోవైపు చదువును కొనసాగిస్తున్నానని చెప్పింది. అంతేకాదు.. పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా, మాకూ మంచిరోజులు వస్తాయి, నేను చదువుకుని పోలీస్‌ ఆఫీసర్‌ను అవుతా.. అంటూ భూమిక ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం భూమిక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ అమ్మాయి కల నెరవేరాలని పలువురు కామెంట్స్ ద్వారా విషెష్ చెబుతున్నారు.

Also Read: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగ.. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవాటానికి గొడుగుతో కవరింగ్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu