PM Modi’s new council: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మహిళలకు పెద్దపీట.. కొత్తగా ఏడుగురికి మంత్రి పదవులు

కేంద్ర కేబినేట్‌ విస్తరణలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాని మోదీ. కొత్తగా ఏడుగురికి కేబినెట్‌లో చోటు లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మహిళా శక్తి పెరిగింది. ఏడుగురు మహిళలకు కొత్తగా మంత్రి పదవులు లభించాయి. వీరిలో NDAలో భాగస్వామ్య పక్షం అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు. 

|

Updated on: Jul 07, 2021 | 9:49 PM

మీనాక్షి లేఖి(Meenakshi Lekhi) : బీజేపీ నేత, ఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లేఖి న్యాయవాదిగా చాలా ఫేమస్. ఆమె వాగ్ధాటి అందరినీ ఆకట్టుకుంటుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సంస్థల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు.

1 / 7
అనుప్రియ సింగ్ పటేల్ (Anupriya Singh Patel):  అప్నాదళ్ (S) నేత అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు.

2 / 7
శోభ కరంద్లాజే(Shobha Karandlaje) : శోభ కరంద్లాజే కర్ణాటకలోని ఉడుపి చిక్‌మగళూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

3 / 7
దర్శన విక్రమ్ జర్దోశ్ (Darshana Vikram Jardosh) : గుజరాత్‌లోని సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోశ్ గెలిచారు. ఆమె 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె వ్యవహరించారు.

4 / 7
అన్నపూర్ణ దేవి (Annpurna Devi):  జార్ఖండ్‌లోని కొడెర్మా బీజేపీ ఎంపీ అన్నపూర్ణ దేవి 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 1998-2000 మధ్య కాలంలో బిహార్ శాసన సభ సభ్యురాలిగా సేవలందించారు.

5 / 7
ప్రతిమ భౌమిక్ (Pratima Bhoumik ): త్రిపుర తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతిమ భౌమిక్. రాజకీయాల్లో ప్రవేశించడానికి పూర్వం ఆమె అగ్రికల్చరిస్ట్. ప్రస్తుతం ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు.

6 / 7
భారతి ప్రవీణ్ పవార్ (Bharati Pravin Pawar): మహారాష్ట్రలోని డిండోరి నియోజకవర్గం బీజేపీ ఎంపీ భారతి ప్రవీణ్ పవార్ ఎంపికయ్యారు. ఆమె నాసిక్‌లో MBBS చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

7 / 7
Follow us