AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Cabinet Reshuffle: మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రధాని మోదీ.. ఇవిగో వివరాలు..

కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

PM Modi Cabinet Reshuffle:  మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రధాని మోదీ.. ఇవిగో వివరాలు..
Modi 2.o
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 08, 2021 | 6:56 AM

Share

కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మంత్రులతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు.​ ఇందులో 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజు, మన్‌సుఖ్‌ మాండవియా, హరిదీప్‌సింగ్‌ పురీ, రామచంద్ర ప్రసాద్​ సింగ్‌.. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కలసికట్టుగా.. ఒక బృందంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని శాఖలను కేటాయించారు. పరిపాలనా అనుభవం, సమర్థతలకు అనుగుణంగా ప్రధాని శాఖలను కట్టబెట్టారు.

మంత్రులు- శాఖలు:

1. నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు. 2. రాజ్‌నాధ్‌ సింగ్ – రక్షణ శాఖ 3. అమిత్ షా – హోంశాఖతోపాటు స‌హ‌కార శాఖ‌ 4. అశ్విని వైష్ణవ్ – రైల్వే, ఐటీ, టెలీ క‌మ్యూనికేష‌న్ల శాఖ 5. జి. కిష‌న్ రెడ్డి- సాంస్కాృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌లు 6. నితిన్ గడ్కరి – జాతీయ ర‌హ‌దారులు 7. నిర్మలా సీతారామ‌న్‌ – ఆర్థిక‌, కార్పొరేట్ శాఖ 8. ఎస్ జైశంక‌ర్ – విదేశాంగం 9. ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ – మైనారిటీ వ్యవహారాలు.. 10. న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం 11. జ్యోతిరాధిత్య సింధియా – పౌర విమాన‌యానం 12. ఆర్‌కే సింగ్‌- విద్యుత్‌, ఇంధ‌న వ‌న‌రుల‌ శాఖ‌లు 13. సర్బానంద సోనోవాల్ – నౌకాయానం, జ‌ల మార్గాలు, ఆయుష్ మంత్రిత్వ శాఖ 14. హ‌ర్దీప్ సింగ్ పూరీ – పెట్రోలియం, హౌసింగ్‌ అఫైర్స్ 15. కిరణ్ రిజిజు – న్యాయ శాఖ 16. అర్జున్ ముండా- గిరిజ‌న సంక్షేమం 17. స్మృతీ ఇరానీ – మ‌హిళా, శిశు సంక్షేమం 18. గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ – జ‌ల శ‌క్తి 19. పీయూష్ గోయ‌ల్- వాణిజ్య, ఆహారం, ప్రజా పంపిణీ, చేనేత, జౌళి శాఖ 20. ధ‌ర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ 21. ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గ‌నుల‌ శాఖ‌లు 22. అనురాగ్ సింగ్ ఠాకూర్‌ – స‌మాచార‌, ప్రసారాలు, యువ‌జ‌న క్రీడా స‌ర్వీసులు.. 23. మాన్‌సుఖ్ మాండ‌వియా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ర‌సాయనాలు, ఫ‌ర్టిలైజ‌ర్స్ 24. భూపేంద్ర యాద‌వ్‌ – ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీ శాఖ‌, కార్మిక శాఖ 25. మ‌హేంద్ర నాథ్ పాండే – భారీ పరిశ్రమలు 26. పురుషోత్తం రూపాలా – పాడి, మత్స్యశాఖ 27. నారాయ‌ణ్ రాణె – సూక్ష్మ, చిన్న, మ‌ధ్య త‌ర‌హా పరిశ్రమలు 28. వీరేంద్ర కుమార్‌- సామాజిక సాధికార‌త‌ 29. గిరిరాజ్ సింగ్‌ – రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్, పంచాయతీ రాజ్ 30. ఆర్సీపీ సింగ్ – ఉక్కు శాఖ 31. ప‌శుప‌తి కుమార్ ప‌రాస్ – ఫుడ్ ప్రాసెసింగ్‌

Also Read: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మహిళలకు పెద్దపీట.. కొత్తగా ఏడుగురికి మంత్రి పదవులు