AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!

WhatsApp: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ వినియోగం అధికమైపోయింది. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ లేనిది అనేది ఉండదు. వాట్సాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య భారీగా..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!
Whatsapp
Subhash Goud
|

Updated on: Jul 08, 2021 | 8:54 AM

Share

WhatsApp: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ వినియోగం అధికమైపోయింది. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ లేనిది అనేది ఉండదు. వాట్సాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాట్సాప్‌ సంస్థ కూడా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఇక వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రొఫైల్ పిక్చర్ ఉందో లేదో చూడండి

ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.

ఒకవేళ అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. మీకు కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు, బ్లూ టిక్స్ కనిపించవు. కాబట్టి మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది.

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి. అయితే నెట్ ఆఫ్ చేసిన వాళ్లు కాసేపటికి అయినా ఆన్ చేస్తారు కాబట్టి.. ఇవన్నీ జరిగితే దాదాపు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే అనుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Google Maps: విదేశీ పర్యాటకులకు చుక్కలు చూపించిన గూగుల్‌ మ్యాప్‌.. అసలేం జరిగిందంటే..!

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!

Follow Us
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు