Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వినియోగదారులకు యూఐడీఏఐ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. తాజాగా కొన్ని..

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!
Follow us

|

Updated on: Jul 08, 2021 | 7:41 AM

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వినియోగదారులకు యూఐడీఏఐ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. తాజాగా కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు ప్రకటించింది. యూఐడీఏఐ నిర్ణయంతో ఆధార్ కార్డు కలిగిన వారిపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవో తెలుసుకుందాం.

ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇక సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. పాత విధానంలో ఆధార్ కార్డును రీప్రింట్ చేసుకోవడం కుదరదు. ఈ రెండు సేవలు ఇక ఆధార్ కార్డు వాడే వారికి అందుబాటులో ఉండవు.

అయితే అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇకపోతే ఆధార్ కార్డు రీప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. ఆధార్ రీప్రింట్ పొందాలని భావించే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు రూపంలో ఉంటుంది.

ట్విట్టర్‌లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే.. వాటిని సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు

Car Loan: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఈ ఐదు బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు..!

Nokia G20: భారత్‌ మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్ విడుదల..అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?

Latest Articles