India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే.. పూర్తి వివరాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,09,557కి చేరింది. ఇందులో 4,60,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 44,291 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,98,43,825కి చేరింది.
అటు బుధవారం 817 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,05,028 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 36,48,47,549 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.18 శాతంగా ఉందని.. అలాగే మరణాల రేటు 1.32 శాతంగా ఉందని పేర్కొంది. కాగా, థర్డ్ వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
Also Read:
ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!
సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!
కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!