Atrocities: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ట్రైన్‌లో నుండి పడిపోయిన ఆరేళ్ల పాప.. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి!

అయినవారు కాదనుకున్నారు. కానీ, అనామకులు చేరదీశారు. కన్నవారు ప్రాణాలు తీయాలనుకుంటే.. కానీవారు ఆసుపత్రికి తరలించి ప్రాణం పోయాలనుకున్నారు.

Atrocities: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ట్రైన్‌లో నుండి పడిపోయిన ఆరేళ్ల పాప.. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి!
Six Year Old Child Fell From A Running Train
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2021 | 10:14 AM

Six-year-old Child fell from a Running Train: అయినవారు కాదనుకున్నారు. కానీ, అనామకులు చేరదీశారు. కన్నవారు ప్రాణాలు తీయాలనుకుంటే.. కానీవారు ఆసుపత్రికి తరలించి ప్రాణం పోయాలనుకున్నారు. కాళ్లు.. కళ్లు.. అన్ని అవయవాలు సరిగా ఉన్న బిడ్డకు ఏ అసరా అవసరం లేదు. కానీ వైకల్యం ఉన్న బిడ్డకే ఓదార్పు కావాలి. ఆత్మస్థైర్యాన్ని నింపాలి. అలా చెయ్యాల్సిన ఓ తల్లి.. ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేసింది. కాదు.. కాదు.. ఏకంగా చంపేస్తే భారం ఉండదని భావించిందేమో.. లేక పాపాయి కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో తెలియదు. ఆరేళ్ల పాపను వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయ్యో అనిపించే ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి మండలం గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుగుచూసింది. ఆరు సంవత్సరాల పాప రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి ఉన్నపళంగా పడిపోయింది. చుట్టుపక్కన ఉన్నవాళ్లు వెంటనే ఆ పాపను గమనించి దగ్గరకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు.

ఆరేళ్ల పాప.. తల్లి లేకుండా డోర్ దగ్గరకి ఎందుకొస్తుంది.. ఎలా వస్తుంది? ఎలా జారిపడుతుంది. ఇదే అనుమానం పోలీసులకూ వచ్చింది. ఆరా తీస్తే.. తల్లే బిడ్డను రైల్లో నుంచి తోసేసిందన్న విషయం తేలింది. కారణం ఆ పాపకు అంగవైక్యల్యం ఉందని.. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. మాట్లాడలేని స్థితిలో విషమపరిస్థితుల్లో అల్లాడుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…. 196 అడుగుల లోతైన స్విమ్మింగ్‌ పూల్‌.. డైవ్ చేస్తే థ్రిల్ అవ్వాల్సిందే.. ఆసక్తి రేపుతోన్న డీప్ డైవ్ దుబాయ్!