AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

196 అడుగుల లోతైన స్విమ్మింగ్‌ పూల్‌.. డైవ్ చేస్తే థ్రిల్ అవ్వాల్సిందే.. ఆసక్తి రేపుతోన్న డీప్ డైవ్ దుబాయ్!

ఈత కొట్టడం మీ సరదానా.. మాములుగా స్విమ్ చేసి విసిగిపోయారా..? అయితే, మీకోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్ రెడీగా ఉంది.

196 అడుగుల లోతైన స్విమ్మింగ్‌ పూల్‌.. డైవ్ చేస్తే థ్రిల్ అవ్వాల్సిందే.. ఆసక్తి రేపుతోన్న డీప్ డైవ్ దుబాయ్!
Worlds Deepest Swimming Pool
Venkata Chari
|

Updated on: Jul 09, 2021 | 10:07 AM

Share

Deep Dive Dubai: ఈత కొట్టడం మీ సరదానా.. మాములుగా స్విమ్ చేసి విసిగిపోయారా..? అయితే, మీకోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్ రెడీగా ఉంది. అవును, నిజమే. చాలా లోతులో దీన్ని రూపొందించారు. అలాగే ఇది గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. మరి ఇది ఎక్కడుంది అంటారా? దుబాయ్ ప్రభుత్వం “డీప్ డైవ్ దుబాయ్” పేరుతో ప్రపంచంలోనే లోతైన స్విమ్మింగ్‌ పూల్‌ను రూపొందించింది. నాడ్ అల్ షెబాలో దీనిని నిర్మించారు. అద్భత కట్టడాలకు నెలవైన దుబాయ్‌.. ఈ స్విమ్మింగ్ పూల్‌తో మరింత ఆకట్టుకునేందు సిద్ధమైంది. దుబాయ్ యువరాజు హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ నిన్న (బుధవారం) ఈ స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభించారు. ఈ మేరకు పూల్‌కి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 60 మీటర్ల లోతుతో (196 అడుగులు) ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌గా రికార్డుల్లోకి ఎక్కంది. ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ మీ కోసం ఎదురుచూస్తోందని దుబాయ్ యువరాజు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. డైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు, అలాగే నీటి లోతట్టు ప్రాంతాల్లో స్విమ్‌ చేసేందుకు ఆసక్తి కలిగిన వారికోసం దీనిని ఏర్పాటు చేశారు.

అంతేకాదు ఈ పూల్‌లోప‌ల ఓ న‌గ‌రం ఏర్పాటు చేశారు, పూర్తిస్థాయి అపార్ట్‌మెంట్‌, గ్యారేజ్‌, ఆర్కేడ్ ఏర్పాటు చేశారు. డైవింగ్ చేస్తూ ఇందులో కొన్ని ఆటలు కూడా ఆడుకోవచ్చంట. ప్రస్తుతం ఈ పూల్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిలో 56 కెమెరాలు ఉన్నాయి. ఇవి డైవింగ్‌ చేసే వారిని ఎల్లవేలలా రికార్డు చేస్తూనే ఉంటాయి. ఇందులోని నీటిని ఆరు గంటలకోసారి శుద్ధి చేస్తారంట. ఈ పూల్ నిండడానికి 1.4 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందంట. అయితే ఈ నీటిని శుద్ధి చేయడానికి నాసా అభివృద్ధి చేసిన నూతన టెక్నాలజీని వాడుతున్నారంట. అయితే ప్రస్తుతానికి కొందరకి మాత్రమే డైవింగ్‌ చేసేందుకు అనుతిస్తున్నారు.

Also Read:

Viral Video: బంజారా పాట.. రష్యాన్‌ల ఆట.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

Viral Video: కజిన్‌తో పెళ్లొదన్న అమ్మాయి…!! కాల్చి చంపిన కుటుంబ సభ్యులు…!! ( వీడియో )

Covid Vaccine: వ్యాక్సిన్‌ వేయించుకున్న పులులు, సింహాలు… (వీడియో)