Kempty Falls: కెంప్టీ వాటర్‌ఫాల్స్ సందర్శకులకు షాక్.. 50 మందికే అనుమతి.. వీడియో వైరల్ కావడంతో చర్యలు
Kempty Water Falls: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రెండు నెలక్రితం లక్షలాది కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 50 వేలకు దిగువున
Kempty Water Falls: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రెండు నెలక్రితం లక్షలాది కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 50 వేలకు దిగువున నమోదవుతున్నాయి. కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను ఎత్తివేశారు. దీంతోపాటు పర్యాటక ప్రాంతాలకు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో పలు పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ముస్సోరీలో ఉన్న ఆ వాటర్‌ఫాల్స్ వద్ద సేదతీరేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వేల సంఖ్యలో జనం అక్కడకు వస్తుండటంతో.. ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఈ క్రమంలో కరోనా కాలంలో వందలాది మంది జలపాతంలో సందడి చేస్తున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అందరూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
View this post on Instagram
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. ఒకే చోట పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడడం వల్ల మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని.. చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కెంప్టీ జలపాతం వద్ద 50 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి టూరిస్టులు ఉండకూడదని ఆదేశించింది. ఆ వాటర్‌ఫాల్స్‌కు వచ్చిన వాళ్లు అరగంట కన్నా ఎక్కువ సమయం అక్కడ ఉండొద్దంటూ సూచించింది. దీంతోపాటు టూరిస్టుల తాకిడిని మానిటర్ చేసేందుకు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెహ్రీ ఘర్‌వాల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇవా ఆశిష్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
Also Read: