Zika Virus: జికా వైరస్ ఏంటి? ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. పూర్తి వివరాలు మీకోసం..

Zika Virus: వైరస్‌ల దాడితో కేరళ రాష్ట్ర అతలాకుతలం అవుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు జికా వైరస్ ఎటాక్ చేస్తోంది.

Zika Virus: జికా వైరస్ ఏంటి? ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. పూర్తి వివరాలు మీకోసం..
Zika Virus
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 09, 2021 | 1:31 PM

Zika Virus: వైరస్‌ల దాడితో కేరళ రాష్ట్ర అతలాకుతలం అవుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు జికా వైరస్ ఎటాక్ చేస్తోంది. కేరళలో తాజాగా జికా వైరస్ కలకం సృష్టించింది. అంటువ్యాది అయిన ఈ జికా వైరస్‌తో ప్రాణాలకే ముప్ప వాటిల్లొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, సరైన జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి కూడా బయట పడొచ్చంటున్నారు వైద్యులు.

అసలు ఈ జికా వైరస్ ఏంటి?.. డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జికా కూడా ఒక రకమైన వైరస్. ఇది దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా ఈడెస్ దోమల ద్వారా వస్తుంది. ఈ జికా వైరస్‌కు పగటిపూట కుట్టే దొమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. జికా వైరస్‌ను 1947 లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించడం జరిగింది. అయితే 2015 లో బ్రెజిల్‌లో వ్యాప్తి చెందింది. అలా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ.. భారత్‌లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. కాగా, జికా ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

లక్షణాలు.. జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. అయితే, మొదట రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తాము జికా బారిన పడ్డామని తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. దీని బయటపడేందుకు రెండు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. ఇక అరుదైన సందర్భాల్లో జికా వైరస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. మెదడు, వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడుతాయి. దీని వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముందుజాగ్రత్తలు.. ఈడెస్ దోమ పగటిపూట, మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా తిరుగాడుతుంది. కావున ప్రజలు బయటకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే.. దోమకాటు నుంచి రక్షణ కల్పించే క్రీములను వినియోగించాలి. అలాగే.. ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే లైంగిక సంబంధాల ద్వారా కూడా జికా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున.. సురక్షితమైన పద్ధతులు ఆచరించాలని వైద్యులు సూచించారు. జికా వైరస్‌ బారిన పడిన భార్య/భర్తతో కొంతకాలం లైంగికంగా కలవడకపోవడం మంచిందని చెబుతున్నారు.

జికా వైరస్ సోకితే చనిపోతారా? జికా వైరస్ సోకిన వారు చనిపోతారని చెప్పలేము.. అలాగే డేంజర్ లేదని కూడా చెప్పలేం అని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇతర దోమల ద్వారా సంక్రమించిన వాయధుల మాదిరిగానే.. జికా ను నయం చేసే మందులు, విశ్రాంతి తీసుకుంటే సాధారణంగానే కోలుకుంటారని చెప్పారు. అయితే, కొద్దిమందికి మాత్రం ప్రాణాపాయం ఉందని చెబుతున్నారు. జికా ను నివారించేందుకు ప్రస్తుతానికి టీకా ఏదీ లేదు. జికా వైరస్ నివారణ కోసం ఫ్రాన్స్‌లోని పరిశోధకలు వ్యాక్సీన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Also read:

I-T Department Recruitment 2021: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 25

Actor Ali: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వైరల్ అవుతున్న మొదటి పోస్ట్.. ఇంతకీ ఎం పోస్ట్ చేశాడో తెలుసా..

Black Magic: ఇంటి ముందు ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు.. హడలిపోయిన కుటుంబసభ్యులు.. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు!