Natural Home Remedies: ఊబకాయంతో నడుం, కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారా . సింపుల్ చిట్కాలు పాటించండి
Natural Home Remedies: ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి తినని తిండి.. నిద్రలేమి.. అధిక ఒత్తిడి.. తగ్గిన శారీరక శ్రమ ఇవన్నీ రోగాల బారిన పడడానికి కారణం అవుతున్నాయి..
Natural Home Remedies: ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి తినని తిండి.. నిద్రలేమి.. అధిక ఒత్తిడి.. తగ్గిన శారీరక శ్రమ ఇవన్నీ రోగాల బారిన పడడానికి కారణం అవుతున్నాయి. అయితే అనారోగ్యానికి గురైన ప్రతి సారీ డాక్టర్ దగ్గరకు వెళ్లడం అంటే.. ఆర్థికంగానే కాదు.. శారీరకంగా ఇబ్బందినే. అందుకనే మన పెద్దలు పాటించిన చిన్న చిన్న వంటింటి చిట్కాలు పాటిస్తూ.. చిన్న చిన్న వ్యాధుల నుంచి మనలని మనం రక్షించుకుందాం.. వంటింట్లో ఉండే ఈ వస్తువులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఆధునిక యుగంలో తగ్గిన శారీరక శ్రమ.. ఫస్ట్ ఫుడ్ కల్చర్ తో అతి బరువు పెరగడం సర్వసాధారణంగా మారింది. ఈ ఊబకాయంతో నడుం నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు వీటికి చిన్న చిట్కాలు తెలుసుకుందాం
అతి బరువు (ఊబకాయం):
*రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా మంచి ఫలితం ఉంటుంది. * కలమంద గుజ్జులో పసుపు కలిపి ఉదయమే పరగడుపున తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు.
కీళ్ళ నొప్పులు:
* కీళ్ల నొప్పులకు జిల్లేడు ఆకు మంచి మెడిసిన్.. జిల్లెడు ఆకును వేడి చేసి.. ఎక్కడైతే కీలు నొప్పి ఉందొ..వేడి ఆకుని పెట్టి కడితే..ముఞ్చి రిలీఫ్ ఇస్తుంది. *మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది. *మనం తినే ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. *లేత బెండకాయలను రాత్రి ఒక గాజు గ్లాసులోని నీటిలో వేసి.. మర్నాడు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
నడుం నొప్పి:
*రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తాగాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది. *రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.
Also Read: చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ తినాలని ఉందా.. ఈజీగా టేస్టీగా ఇలా తయారు చేసుకోండి