AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: ఇంటి ముందు ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు.. హడలిపోయిన కుటుంబసభ్యులు.. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు!

తెల్లవారే సరికి ఇంటి ముందు చేతి ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు, పసుపుకుంకుమ కలిపిన బియ్యం, జాకెట్‌ముక్క, జీడి, వక్క, గాజులు, గవ్వలు, వెంట్రుకలు, పాయింట్‌ ముక్క, తదితరాలు కలిపి ఉంచారు.

Black Magic: ఇంటి ముందు ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు.. హడలిపోయిన కుటుంబసభ్యులు.. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు!
Nalgonda Black Magic
Balaraju Goud
|

Updated on: Jul 09, 2021 | 1:16 PM

Share

Nalgonda black magic: నల్లగొండ రూరల్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన బొల్లోజు వెంకటాచారి ఇంటి గేట్‌ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి పూజలు చేసినట్లు అనవాళ్లు కనిపించాయి. తెల్లవారే సరికి ఇంటి ముందు చేతి ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు, పసుపుకుంకుమ కలిపిన బియ్యం, జాకెట్‌ముక్క, జీడి, వక్క, గాజులు, గవ్వలు, వెంట్రుకలు, పాయింట్‌ ముక్క, తదితరాలు కలిపి ఉంచారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు

బుధవారం తెల్లవారుజామున వెంకటాచారి భార్య రత్నమ్మ ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూడగా ఈ వస్తువులన్నీ కనిపించడంతో భయాందోళనకు గురై కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్‌ పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలను, ఇంటిఎదుట వదిలివెళ్లిన వస్తువులపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. కీలక ఆధారాలు లభించడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం గాలిస్తోంది.

జూన్‌ 16న వెంకటాచారి చిన్న కుమారుడు ప్రవీణ్‌చారితో నల్లగొండకు చెందిన యాదగిరి – సావిత్రిల కుమార్తె అఖిలతో వివాహం జరిగింది. కుటుంబ బంధాన్ని తెంచేందుకు గిట్టనివారు ఎముకలు, జీడిగింజలు, పసుపు బియ్యం తదితర వస్తువులను కలిపి ఇంటి గేట్‌ ఎదుట వదిలి వెళ్లి ఉంటారని, అఖిల తల్లిదండ్రులకు గిట్టనివారే ఈపని చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బైక్‌పై వచ్చిన దుండగులు వెంకటాచారి ఇంటి ఎదుట భయంగొలిపే వస్తువులను వదిలివెళ్లినట్లు గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. వీటి ఆధారంగా ఆ ఇంటి నుంచి వచ్చిపోయిన ఫోన్‌ కాల్స్‌ను, అఖిల తల్లిదండ్రులైన యాదగిరి– సావిత్రిలకు గిట్టనివారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.

Read Also…. Narayanaswamy: నాడు కుల విపక్షతో ఆలయంలో అనుమతి నిరాకరణ.. నేడు సామాజిక న్యాయం, సాధికారత శాఖ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు