Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ali: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వైరల్ అవుతున్న మొదటి పోస్ట్.. ఇంతకీ ఎం పోస్ట్ చేశాడో తెలుసా..

ప్రస్తుతం సోషల్ మీడియా హావా ఏ రేంజ్‏లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. గంటలు తరబడి నెట్టింట్లోనే గడిపేస్తున్నారు.

Actor Ali: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వైరల్ అవుతున్న మొదటి పోస్ట్.. ఇంతకీ ఎం పోస్ట్ చేశాడో తెలుసా..
Ali
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 09, 2021 | 1:20 PM

ప్రస్తుతం సోషల్ మీడియా హావా ఏ రేంజ్‏లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. గంటలు తరబడి నెట్టింట్లోనే గడిపేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలబ్రెటీలుగా మారుతున్నారు. టాలెంట్ ఉన్నా లేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటో పడిందంటే లైక్స్, వ్యూస్ రావాల్సిందే.. సెలబ్రెటీ కావాల్సిందే. అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా.. పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాను వీపరింతంగా వాడేస్తున్నారు. తమ వ్యక్తిగత జీవిత విషయాలతోపాటు.. సినిమా ప్రమోషన్స్ కూడా సోషల్ మీడియా ద్వారానే కానిచ్చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఖాతా తెరవని వారు కూడా దానికున్న క్రేజ్‏ను అకౌంట్స్ ఓపెన్ చేసేస్తున్నారు. తాజాగా కమెడియన్ కమ్ సీనియర్ నటుడు అలీ ఇన్‏స్టాగ్రామ్‏లోకి అడుగుపెట్టేశారు. రావడం రావడంతోనే 20 వేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు అలీ.

ఇన్‏స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అలీ అందులో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. అందరిని ఆకర్షించారు. చాలా రోజుల తర్వాత అలీ హీరోగా నటిస్తున్న “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి “. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అలీ బాగానే కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇన్‏స్టా అకౌంట్ ఓపెన్ చేయగానే అందులో ఈ సినిమాకు సంబంధించి ఫోటో షేర్ చేస్తూ వివరణ ఇచ్చారు.. “ఇది నా అఫీషియల్ అకౌంట్. ఈ స్టిల్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలోని. నా గుండె చిక్కుకుంది అనే పాటలోని ఫోటో ఇది ” అంటూ చెప్పుకొచ్చాడు అలీ. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అలీ ఇన్‏స్టా అకౌంట్ ఓపెన్ చేయడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. బిగ్‌బాస్‌‏ కోసమే అలీ ఆకస్మాత్తుగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారా ? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బిగ్‏బాస్ 5లోకి అలీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Ali (@ali_the_actor)

Also Read: Kamna Jethmalani: కెరీర్ టాప్‏లో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది… ఇప్పటికీ ఒక కోరిక మిగిలిందంటున్న హీరోయిన్..

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

Genelia-Riteish: ‘మూడ్, ఉత్సాహం అన్నీ పాయే’.. హీరో, హీరోయిన్ల రొమాన్స్‌కు బ్రేక్.. చూసి తీరాల్సిందే.!