- Telugu News Photo Gallery Business photos Zomato announces online grocery delivery service its app soon
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం.. త్వరలో ఆన్‌లైన్ కిరాణ డెలివరీ సేవలు
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. గురువారం జరిగిన మీడియా..
Updated on: Jul 09, 2021 | 12:22 PM

Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో జోమాటో ఈ విషయాన్ని ప్రకటించింది.

గత ఏడాది ఏప్రిల్‌లో జోమాటో ప్రారంభంలో 80 కి పైగా నగరాల్లో తొలిసారిగా కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించగా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జోమాటో తిరిగి ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను పునరుద్దరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

జోమాటో ఈనెల 14 నుంచి ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ప్రారంభించడానికి ముందే ఆన్‌లైన్ కిరాణ డెలివరీలో అడుగుపెట్టాలని జోమాటో తాజా ప్రకటన చేసింది. జోమాటో రూ. 9,375 కోట్లను సమీకరించాలని భావిస్తోంది . జోమాటో షేర్ల తాజా ఇష్యూ రూ. 72 నుంచి 76 చొప్పున ఉండనున్నట్లు తెలుస్తోంది

కరోనా మహమ్మారి కారణంగా వినియోగదారులు అధికంగా ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీల వైపు మొగ్గు చూపారు. గ్రోఫర్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పటికీ, జోమాటో తన సొంత ప్రణాళికలతో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభిస్తోందని జోమాటో సిఎఫ్ఓ అక్షంత్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కిరాణా డెలివరీలలో జోమాటో తిరిగి రావడం తన సమీప ప్రత్యర్థి స్విగ్గీకి కఠినమైన పోటీని ఇవ్వగలదని అన్నారు.




