Google pay: గూగుల్ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో తెలుసా…
UPI పేమెంట్స్ ఈజీగా చేసేవాటిలో Google Pay కూడా ఒకటి.. ఏదిఏమైనా.. ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి UPI మోడ్ పేమెంట్ సొంత పరిమితులు ఉంటాయి. అంటే.. రోజుకు ఎంతవరకు డబ్బులు...
డిజిటల్ ప్లాట్ ఫాంపై నాణ్యమైన సేవలు అందిస్తున్నాయి Google Pay, PhonePe, Paytm సంస్థలు. ఇందులో ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ ప్లాట్ ఫాం గూగుల్ పే (Google Pay) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. UPI పేమెంట్స్ ఈజీగా చేసేవాటిలో Google Pay కూడా ఒకటి.. ఏదిఏమైనా.. ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి UPI మోడ్ పేమెంట్ సొంత పరిమితులు ఉంటాయి. అంటే.. రోజుకు ఎంతవరకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే అంశాల్లో లిమిట్ కూడా ఉంది. అలాగే Google Payకు కూడా రోజుకు లేదా నెలలో ఎంతవరకు గరిష్టంగా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చో ఒక లిమిట్ కూడా ఉంది.
రోజులో…
సాధారణంగా అన్ని UPI apps ద్వారా ఒక రోజులో లక్షకు పైగా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలన్నా… అలాగే ఒక రోజులో 10 కంటే ఎక్కువ సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలనుకున్నా.. ఎవరైనా నుంచైనా రూ.2వేల కంటే ఎక్కువ అమౌంట్ రిక్వెస్ట్ కోసం ట్రై చేస్తే.. పేమెంట్ కాదని గుర్తించుకోవాలి. గూగుల్ పే, UPI, యూజర్ల బ్యాంకు, గూగుల్ మధ్య పరిమితులు ఒక్కోలా ఉంటాయి. ఒకవేళ మీ డెయిలీ మనీ ట్రాన్స్ ఫర్ లిమిట్ దాటితే మాత్రం.. 24 గంటలు ఆగాల్సిందే.. లేదంటే.. చిన్నమొత్తంలో అమౌంట్ పంపేందుకు రిక్వెస్ట్ పంపుకోవచ్చు. గూగుల్ పే నుంచి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా పేమెంట్ కాదు.
బ్యాంక్ పరిమితి కారణం ఒకవేళ.. మీ డెయిలీ ట్రాన్సాక్షన్స్ UPI లిమిట్ కంటే తక్కువగా ఉన్నా.. మీ అమౌంట్ పేమెంట్ కావడం లేదంటే.. మరో బ్యాంకులో ట్రై చేయొచ్చు. ఎందుకంటే.. ప్రతి బ్యాంకుకు ఒక డెయిలీ ట్రాన్స్ ఫర్ లిమిట్ ఉంటుంది. డబ్బులు బదిలీ చేయాలన్నా.. క్రెడిట్ కావాలన్నా ఆయా బ్యాంకుల రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ పై ఆధారపడి ఉంటుంది.
ఇతర కారణాల వల్ల లావాదేవీలు ఆగిపోవచ్చు.. ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఈ పరిమితులు ఉంటాయి. ఏదైనా అనాధికారిక ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తిస్తే.. వెంటనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. రివ్యూ చేయాల్సి ఉంటుంది. మీరు డెయిలీ లిమిట్ దాటకపోయినా.. మీరు ట్రాన్సాక్షన్ చేయలేని పక్షంలో Google Pay సపోర్ట్.. హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ.. గూగుల్ పే యూజర్ రూ.1 కంటే తక్కువ అమౌంట్ ట్రాన్స్ ఫర్ లేదా రీసీవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే పేమెంట్ కాదు.. మీకో ఎర్రర్ మెసేజ్ వస్తుంది.