Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారా? డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్..!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే.. అవుననే అంటున్నారు డీఎంకే..

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారా? డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్..!
Dmk Mp Kanimozhi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2021 | 12:58 PM

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే.. అవుననే అంటున్నారు డీఎంకే నేతలు. తాజాగా ఇదే అంశంపై డీఎంకే ఎంపీ, ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కొంగుమండలాన్ని కొంగునాడు గా ఏర్పాటు చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోందంటూ వస్తున్న వార్తలపై డీఎంకే ఎంపీ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర విభజనను తాము అంగీకరించబోమన్నారు. అలాంటి ఆలోచన కూడా తమకు లేదన్నారు. కొంతమంది తమిళనాడు రాష్ట్రాన్ని రెండు విభజించాలని కలలు కంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, వారి కలలు ఎప్పటికీ ఫలించబోవన్నారు. మెజారిటీతో ఉన్న డీఎంకే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విభజనకు ఒప్పుకోదని కనిమొళి తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగబోదని కనిమొళి ఉద్ఘాటించారు.

‘జికా’పై అలర్ట్ అయిన తమిళనాడు.. ఇదిలాఉంటే.. కేరళ రాష్ట్రంలో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ-తమిళనాడు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక మెడికల్ బృందాలను తరలించారు. సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూర్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేరళ నుంచి వచ్చే వాహనాలకు ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించిన తరువాతే రాష్ట్రంలోకి ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు సరిహద్దు గ్రామాలలో ఇంటింటికీ అధికారులు పర్యటిస్తున్నారు. జికా వైరస్ లక్షణాలు ఉన్న వారికోసం ప్రత్యేక వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Also read:

Viral Video: విచక్షణ కోల్పోతున్న అధికారులు.. జర్నలిస్టును తరిమి తరిమి కొట్టిన ఐఏఎస్.. వీడియో కలకలం..

Chittoor District: సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాకే..

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కొడుకులకు షాక్.. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగింపు