AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుకోవడం వెనుక కారణమిదేనా? ఆసక్తికర కథనం మీకోసం..

Revanth Reddy: హుజురాబాద్ లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కొత్త చీఫ్ ఎలాంటి ఎత్తులు వేయబోతున్నాడు? ఒక్కసారిగా పెరిగిన గ్రాఫ్ హుజురాబాద్ లో

Revanth Reddy: హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుకోవడం వెనుక కారణమిదేనా? ఆసక్తికర కథనం మీకోసం..
Revanth Reddy
Shiva Prajapati
|

Updated on: Jul 11, 2021 | 1:54 PM

Share

(రిపోర్టర్ అశోక్, టీవీ9 తెలుగు, హుజురాబాద్)

Revanth Reddy: హుజురాబాద్ లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కొత్త చీఫ్ ఎలాంటి ఎత్తులు వేయబోతున్నాడు? ఒక్కసారిగా పెరిగిన గ్రాఫ్ హుజురాబాద్ లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇది ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యత ను.. ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహకు అప్పగించింది. ఉప ఎన్నికల బాధ్యతలను రేవంత్ సైడ్ ట్రాక్ చేయడంలో ఏమైనా వ్యూహం ఉందా..? ప్రత్యేక కథనం మీకోసం..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ వచ్చింది. పీసీసీ నియామకం తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్‌తో నేతలు, క్యాడర్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. ఏ ఎన్నిక వచ్చినా గట్టిగా పోరాడటంతో పాటు విజయం సాధిస్తామనే ధీమా పెరిగింది. దీంతో ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ క్యాడర్ అలాగే భావిస్తోంది. అంతేకాదు కొంత మంది కాంగ్రెస్ బడా నేతలు సైతం.. ఈ ఉప ఎన్నిక పోరును ఆసక్తిగా గమనిస్తున్నారు.

పీసీసీ కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన టీమ్.. ప్రధానంగా రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పై కూడా డిస్కషన్ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యత ను.. ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కు అప్పగించాలని నిర్ణయించారు. ఆమేరకు ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అభ్యర్థి ఎంపిక విషయంపై కూడా దామోదర రాజనర్సింహకే పూర్తి అధికారాలు ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సైలెంట్ గా ఉంటుండటం.. ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాఫిక్ గా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ సైలెంట్ గా ఉండటం వెనక అనేక వ్యూహాలు ఉన్నట్లు గాంధీ భవన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా అందరూ వ్యతిరేకించినా.. అధిష్టానం సీనియర్లందరినీ కలుపుకొని పోవాలని రేవంత్ కు సూచించిందట. అంతేకాదు.. సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లాలని.. అందులో భాగంగానే ఎలక్షన్ కమిటీ చైర్మన్ కు బాధ్యతలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే.. హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, ఈ స్థితిలో ఎక్కువ చాన్స్ తీసుకున్నా.. ఫలితాలు తేడా వస్తే అసలుకే మోసం అవుతుందనే భావనలో రేవంత్ ఉన్నట్లు టాక్. అందుకే హుజురాబాద్ విషయంలో అభ్యర్థి ఎంపికతో సహా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని రేవంత్ సైడ్ అయిపోయారని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా హుజురాబాద్ విషయంలో రేవంత్ సైడ్ కావడంతో క్యాడర్ లో జోష్ తగ్గిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పరిస్థితి మారుతుందా?.. ఇలాగే కంటిన్యూ అవుతుందా?.. అనేది వేచి చూడాలి.

Also read:

Electrocution: రెప్పపాటులో విషాదం.. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం..

Kuntala Waterfalls: డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పట్టు తప్పిందో ప్రాణాలు గోవిందా..!

Employee Commits Suicide: బ్యాంకులో ఉద్యోగం.. ఈ నెల 4వ తేదీన నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం..!