Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komati Reddy: ఢిల్లీ మాట : కిషన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన కోమటి రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడొద్దంటూ ఆగ్రహం

నో పాలిటిక్స్- ఓన్లీ డెవలప్ మెంట్. 'తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంత్రయిన కిషన్ రెడ్డిని.. రకరకాల అభివృద్ధి విషయమై కలిశా. అందులో తప్పేమున్నది. భువనగిరి కోట..

Komati Reddy: ఢిల్లీ మాట : కిషన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన కోమటి రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడొద్దంటూ ఆగ్రహం
Komati Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 11, 2021 | 3:37 PM

Komati Reddy – Kishan Reddy – Revanth Reddy: నో పాలిటిక్స్- ఓన్లీ డెవలప్ మెంట్. ‘తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంత్రయిన కిషన్ రెడ్డిని.. రకరకాల అభివృద్ధి విషయమై కలిశా. అందులో తప్పేమున్నది. భువనగిరి కోట నుంచి చూస్తే హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ మొత్తం కనిపిస్తది. ప్రతి ఎన్నికల్లో భువనగిరి కోట ఒక హామీ.. కానీ ఏం జరుగుతోంది? ఎక్కడ కోట అక్కడే. అలాంటి కోట అభివృద్ధి గురించి అడిగిన అంతే కానీ.. ఇంద్ల రాజకీయాలేడున్నాయ్..’ ఇదీ.. ఢిల్లీలో కొత్తగా ప్రొమోటైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన తర్వాత కోమటి రెడ్డి చెప్పుకొచ్చిన మాట.

అంతే కాదు.. పీసీసీ చీఫ్ పదవి నాకొక జుజుబి. ‘చీఫ్ అన్నది నాకు చాలా చాలా చిన్న విషయం. చూసిన్రుగా.. రిజల్ట్ ఎట్టొస్తున్నయో.. ఇయ్యాల్రేపు ఎవరి ఏరియాలో వాళ్లు గెలవటమే గొప్ప. ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తే.. చిన్నపిల్లడి గురించి నా దగ్గర తీయకండి..’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి.

‘కిషన్ రెడ్డి మొదటి నుంచి వివాదరహితుడు, సౌమ్యుడు, అనేక సంవత్సరాలు కలిసి పని చేశాం.. కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ పెండింగ్ అంశాలు పూర్తిచేసేందుకు సహకరించాలని, మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డిని కోరా..’ అని కోమటిరెడ్డి వెల్లడించారు.

‘రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు, పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్ రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా, అభివృద్ధి పైనే దృష్టి సారించా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మరే ఆలోచన లేదు, నేనేందుకు పార్టీ మారుతా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు కోమటి రెడ్డి.

‘తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. నా నియోజకవర్గ ప్రజలకు, నా జిల్లాకు, తెలంగాణకి అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’ అంటూ భువనగిరి ఎంపీ సరికొత్తగా వ్యాఖ్యానించారు.

ఇలా ఉండగా, కిషన్ రెడ్డితో దాదాపు 45 నిమిషాల సేపు భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు వెల్లడించారు. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానని వెల్లడించారు.

Read also: Guntur: నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే..! అంటూ బ్లేడుతో ఒళ్ళంతా చెక్కేశాడు