Guntur: నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే..! అంటూ బ్లేడుతో ఒళ్ళంతా చెక్కేశాడు

నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ ఒక భర్తని బ్లేడుతో ఒళ్ళంతా..

Guntur:  నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే..! అంటూ బ్లేడుతో ఒళ్ళంతా చెక్కేశాడు
Blade Attack
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 10, 2021 | 9:33 PM

Lover attack on Husband : నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ ఒక భర్తని బ్లేడుతో ఒళ్ళంతా తీవ్రంగా గాయాలపాలు చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి లో జరిగింది. వడ్లమూడి గ్రామానికి చెందిన రాజు.. తెనాలి బస్టాండ్ లోని ఒక లాడ్జి లో పనిచేస్తుంటాడు. ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ మూడేళ్ల పాటు సంసారం సాఫీగానే జరిగింది. అయితే వీరి మధ్యలోకి ఆసిఫ్ అనే వ్యక్తి వచ్చాడు. పెళ్లి కాకముందే నిన్ను నేను ప్రేమించాను, నీ భర్తను వదిలేసి రావాలని ఆమెను ప్రతిరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నాడు ఆసిఫ్.

దీంతో విషయాన్ని తన భర్త అయిన రాజు కు చెప్పింది భార్య. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు.. ఆసిఫ్ వద్దకు వెళ్లి ఎందుకు నా భార్య వెంట పడుతున్నావ్ అని వారించాడు. ఇది మనసులో పెట్టుకున్న ఆసిఫ్ వెంటనే నీ భార్య ని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తానంటూ ఆసిఫ్ ముగ్గురు స్నేహితులతో కలిసి రాజుని అతి దారుణంగా బ్లేడ్ లతో ఒళ్లంతా కోసి గాయపరిచాడు.

దాడిలో తీవ్ర గాయాలపాలైన రాజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Cheddi Gang: నగరంలోని నిర్మానుష ప్రాంతాలే టార్గెట్‌.. అర్థరాత్రి వేళ చెడ్డీలు తడిపేస్తోన్న చెడ్డీ గ్యాంగ్.!