Cheddi Gang: నగరంలోని నిర్మానుష ప్రాంతాలే టార్గెట్.. అర్థరాత్రి వేళ చెడ్డీలు తడిపేస్తోన్న చెడ్డీ గ్యాంగ్.!
చెడ్డీ గ్యాంగ్.. ఈపేరు వింటేనే నగర వాసులు భయపడుతున్నారు. బనీయన్లు, చెడ్డీలు ధరించి, చేతిలో ఓ రాడ్‌తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్.
రంజిత్, టీవీ9 ప్రతినిధి
Cheddi gang: చెడ్డీ గ్యాంగ్.. ఈపేరు వింటేనే నగర వాసులు భయపడుతున్నారు. బనీయన్లు, చెడ్డీలు ధరించి, చేతిలో ఓ రాడ్‌తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్. ఎలాంటి తాళమైన, డోర్‌నైనా ఒక్క రాడ్ సహాయంతోనే విరగొట్టడం ఈ చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. అంతే కాదు చోరీకి వచ్చేటప్పుడు తమ వెంట రాళ్లను తెచ్చుకుంటారు. ఎవరైనా చూసిన, చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. చోరీ చేసి వెళ్లేటప్పుడు ఎవరైనా వెంటపడిన వారి పై దాడి చేయడానికి ప్రయత్నించినా ఈ రాళ్లతో దాడి చేస్తారు.. ఇలా నగర శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలో వెలుస్తున్న కాలనీలను టార్గెట్‌గా చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈ గ్యాంగ్‌లు హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో దోపిడీలకు పథకం వేశాయి. ఒక్కో గ్యాంగ్‌లో పది మంది వరకు ఉంటారు. వీరు మారణాయుధాలు కలిగి ఉంటారు. దోపిడీ సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. చెడ్డీ గ్యాంగు సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకుంటారు. ముఖ్యంగా కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు. ఈ చెడ్డి గ్యాంగుకు మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్. శరీరానికి ఒండ్రు మట్టి గాని లేదా నూనె రాసుకుని సంచరిస్తారు.. పగలు కుర్తా లేకపోతే లుంగీ ధరిస్తారు… ఈ గ్యాంగ్ ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో లేదా కాలనీల్లో ఉన్న ఖాళీ ప్లాట్లలో బస చేస్తారు. పగలు బిచ్చగాళ్లలాగా లేదా కూలీలలాగా నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్ళు దోపిడీ చేయడమే చెడ్డి గ్యాంగ్ టార్గెట్.
ఈ ముఠా ఎక్కువగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు మాత్రమే చోరీ చేస్తుంది. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే దొపిడీలకు తెగబడుతుంది. అలాంటప్పుడు దాడులు చేయడానికి, ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కుడా ఈ గ్యాంగ్ వెనుకాడదు. చోరీ చేసే సమయంలో ఏవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే …వారి చేతికి గ్రీజు, నూనె వంటివి పూసుకుంటారు. ఇది కుడా టార్గెట్ చేసిన ఇంటికి సమీపంలో వస్త్రాలు తీసిసిన తర్వాత పూసుకుంటారు. అ సమయంలో వీరినెవరైనా అడ్డుకోడానికి ప్రయత్నిస్తే దాడికి తెగబడుతారు. ఓ ప్రాంతంలో వరుస నేరాలు చేస్తే పోలీసుల నిఘాకు చిక్కకుండా తక్షణం అక్కడి నుండి మకాం మార్చేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోతారు. అ తర్వాత నిఘా తగ్గిన వెంటనే మళ్లీ చోరీలకు పాల్పడుతుంది చెడ్డి గ్యాంగ్.
ఇప్పుడు మళ్లీ చెడ్డి గ్యాంగ్ అనవాళ్లను సిటీ శివారు ప్రాంతాల్లో కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నాగారంలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్న దృశ్యాలను సేకరించారు పోలీసులు. మరణాయుధాలు వెంట పెట్టుకొని చోరీలకు తిరుగుతుండటంతో శివారు ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. మరోవైపు డే టైంలో రెక్కి లు నిర్వహించి చోరీలకు పాల్పడే అలవాటు ఉన్న చెడ్డి గ్యాంగ్ కదలికలపై మఫ్టీ పోలీసులను రంగంలోకి దించారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘాను పెంచారు పోలీసులు. ఎక్కడ చోరీలు జరిగినా క్షణాల్లో అక్కడికి వెళ్లిపోయి చెడ్డి గ్యాంగ్ కదళికలపై అరా తీస్తున్నారు. జరుగుతున్న చోరీల్లో చెడ్డి గ్యాంగ్ ప్రమేయం ఉందా…లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు చెడ్డి గ్యాంగ్ పై సోషల్ మీడియాలో వదంతులు ఎక్కువ కావడంతో ప్రజల్లో భయందోళన నెలకొంది.
Read also: AP HC: జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే..!