AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. తెలంగాణ సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అంటూ.

Chiranjeevi: తెలంగాణ సమాజంలో బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకతను స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఏటా ఆషాడమాసంలో ఈ వేడుకను తెలంగాణ ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా...

Chiranjeevi: ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. తెలంగాణ సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అంటూ.
Chiranjeevi Tweet
Narender Vaitla
| Edited By: |

Updated on: Jul 11, 2021 | 3:34 PM

Share

Chiranjeevi: తెలంగాణ సమాజంలో బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకతను స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఏటా ఆషాడమాసంలో ఈ వేడుకను తెలంగాణ ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున అమ్మ వార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇక ఆదివారం హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యాయి. దీంతో పలువురు ప్రముఖులు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ ప్రజానికానికి ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక చిరంజీవి సినీ కెరీర్‌ విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

చిరు చేసిన ట్వీట్‌..

Also Read: New Look: కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకోండి. మొన్నటి వరకు లవర్‌ బాయ్‌గా.. ఇప్పుడు.

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Kajal Aggarwal: అందాల చందమామ అమ్మ పాత్రలకు ఓకే చెప్పిందా..? నిజమే అంటున్నారే..!