New Look: కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకోండి. మొన్నటి వరకు లవర్ బాయ్‌గా.. ఇప్పుడు.
New Look: టాలీవుడ్ హీరోలు హాలీవుడ్ హీరోలను సైతం మైమరిపిస్తున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా కనిపించడానికి మొగ్గు చూపిన హీరోలు ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఫ్యాన్స్ వావ్ అనిపించేలా చేస్తున్నారు. ఈ జాబితాలో...
New Look: టాలీవుడ్ హీరోలు హాలీవుడ్ హీరోలను సైతం మైమరిపిస్తున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా కనిపించడానికి మొగ్గు చూపిన హీరోలు ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఫ్యాన్స్ వావ్ అనిపించేలా చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్.. రానా, అల్లు అర్జున్ మొదటి వరసులో ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో వచ్చి చేరారు. మొన్నటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన అక్కినేని నట వారసుడు యంగ్ హీరో అఖిల్ తన మేక్ ఓవర్‌ను పూర్తిగా మార్చేశారు. అఖిల్ కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో కనిస్తున్న వ్యక్తి అఖిల్ అని చెప్పేంత వరకు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఈ యంగ్ హీరో అండర్ కవర్ ఆపరేషన్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరైన విజయాన్ని అందుకోని అఖిల్ ఈసారి ఎలాగైనా బంపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే తన బాడీని పూర్తిగా మార్చేశారు. అఖిల్ న్యూలుక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ‘ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇందులో అఖిల్ అటువైపు నిలబడి కండలు తిరిగిన బాడీని చూపిస్తున్నారు. ఇక వీపుపై కొమ్ములు కలిగిన మేక టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అఖిల్ ఈసారి గట్టిగా కొట్టడానికి సిద్ధమవుతున్నారని ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ సోమవారం (జులై 12) నుంచి ప్రారంభం కానుంది.
వైరల్‌గా మారిన ఫొటో..
This is just the beginning…Meeku mundu mundu undi pandaga!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/trOj5shejN
— SurenderReddy (@DirSurender) July 11, 2021
Also Read: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం ‘దొంగ’ అయితే బెటర్..విపక్ష నేత మరియం నవాజ్ ధ్వజం
Kathi Mahesh Death: స్వస్థలానికి కత్తి మహేశ్ మృతదేహం తరలింపు.. నేడు అంత్యక్రియలు..
Ram Pothineni: రామ్ పోతినేని లింగు స్వామితో ఉస్తాద్ అని పిలిపించుకోనున్నాడా..?