Karthika Deepam: బుల్లి తెరపై రికార్డ్ సృష్టించిన కార్తీక దీపం సీరియల్ .. వెండి తెరపై అడుగు పెట్టడానికి సన్నాహాలు
Karthika Deepam: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తూ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్.. 1090 ఎపిసోడ్స్ కు చేరువలో ఉంది...
Karthika Deepam: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తూ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్.. 1090 ఎపిసోడ్స్ కు చేరువలో ఉంది. దాదాపు మూడున్నర ఏళ్లుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటునే ఉంది. స్మాల్ స్క్రీన్ పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆడమగ అనే తేడా లేకుండా ఆకట్టుకున్న ఈ సీరియల్ త్వరలో వెండి తెరపై అడుగు పెట్టడానికి రంగం సిధ్దం మవుతున్నట్లు తెలుస్తోంది.
మలయాళంలో కరుతముత్తు సీరియల్ అక్కడ సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో నటించిన ప్రేమి విశ్వనాథ్ కు మంచి పేరుతొ పలు అవార్డులను తెచ్చింది. మలయాళంలో అద్భుతమైన విజయం సాధించిన కరుతముత్తు పై ఇతర భాషా నిర్మాతల దృష్టిపడింది. దీంతో కన్నడలో ముద్దులక్ష్మి, తమిళంలో భారతీ కన్నమ్మ, మరాఠీలో రంగ్ మజా వెగ్లా, హిందీలో కార్తీక్ పూర్ణిమగా సీరియల్ తెరకెక్కింది. తెలుగులో కార్తీకదీపంగా తెరకెక్కి.. సూపర్ హిట్ గా కొనసాగుతూనే ఉంది. ఎన్నడూ లేనివిధంగా కార్తీక దీపం అశేష స్పందన సొంతం చేసుకుని.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. సీరియల్ కంటెంట్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్, కథ, కథనాలు ఈ సీరియల్‌ను టాప్ రేటింగ్‌ను అందుకొనేలా చేస్తున్నది. హీరోయిన్ దీప హీరో డాక్టర్ బాబు అత్త క్యారెక్టర్ లో సౌందర్య, విలన్ శ్వేతా శెట్టి, నుంచి పనిమనిషి ప్రియమణి క్యారెక్టర్ కూడా అభిమానులను సొంతం చేసుకుంది అంటే.. అది ఒక్క కార్తీక దీపానికి సొంతం అని చెప్పవచ్చు.
కథలోని మలుపులు ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్న ఈ సీరియల్ ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీరియల్ కథను సినిమాకు అవసరం అయినంతవరకూ తీసుకుని సినిమా గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సీరియల్ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read: ఆ దేశంలో మూడో దశలో అడుగు పెట్టిన కరోనా వైరస్.. భారీ సంఖ్యలో కేసులు నమోదు.. యువతపైనే ఎక్కువ ప్రభావం